ఉద్యోగాలు భర్తీ లేక అల్లాడిపోతున్న నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సుమారు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన జగన్ తొందరలో సుమారు 45 వేల పోస్టుల భర్తీకి రెడీ అవుతున్నట్లు సమాచారం. వివిధ శాఖల్లో సంవత్సరాల తరబడి భర్తీకి నోచుకోకుండా ఉండిపోయిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జగన్ డిసైడ్ చేశారట.

 

వివిధ శాఖల్లో ఖాళీలున్న పోస్టుల లెక్క తీయాలని గతంలోనే జగన్ శాఖాధిపతులకు ఆదేశాలిచ్చారు. చాలా శాఖల నుండి జగన్ కు నివేదికలు అందాయి. మరికొన్ని శాఖల్లో ఖాళీల లెక్కింపు జరుగుతున్నాయి. ఏదేమైనా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భర్తీకి రెడీగా 44, 941 పోస్టులున్నట్లు సమాచారం.

 

తిరుమల తిరుపతి దేవస్ధానంలోనే వివిధ విభాగాల్లో అనేక క్యాటగిరీల్లో  సుమారు 7 వేల పోస్టులున్నాయట. పోలీసు శాఖలో 13, 591 పోస్టులున్నాయని సమాచారం. కానిస్టేబుల్ నుండి ఎస్ఐ స్ధాయి పోస్టు వరకూ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయట. ఇక స్కూళ్ళల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. మొత్తం 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు హయాంలో డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వటం రద్దు చేయటంతోనే పుణ్యకాలమంతా గడిచిపోయింది.

 

ఇక గ్రూపు-2 పోస్టులు సుమారు వెయ్యి దాకా ఉన్నాయట. గ్రూప్-4లో 2,600 పోస్టులున్నాయి. అటవీశాఖలో 2.750 పోస్టులున్నాయి. ఈ శాఖలో ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, వాచర్లు, కానిస్టేబుళ్ళు లాంటి ఫీల్డ్ పోస్టులు భర్తీ చేయాల్సుంది. రెవిన్యు, మున్సిపాలిటి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో సుమారు 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

దరఖాస్తు చేయాల్సిన అభ్యర్ధుల వయసు అర్హత  విషయంలో చాలా పోస్టులకు 18-30 అన్న నిబంధన అందరికీ తెలిసిందే. ఏజ్ విషయంలో ఏమైనా రిలాక్సేషన్ ఇవ్వాలని అనుకుంటే ప్రభుత్వమే ఆ విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టం చేస్తుంది. మొత్తం మీద జగన్ వచ్చిన దగ్గర నుండి నిరుద్యోగుల విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లే అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: