మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశాలకు అధికార పర్యటనలపై వెళ్లిన సమయంలో హోటల్స్‌లో ఉండటాన్ని ఇష్టపడరట. ఈ విషయం సవ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభకు తెలిపారు. ఇంతకీ మోడీ విదేశీ పర్యటలన సందర్భంగా హోటల్స్‌లో కాకుండా ఎక్కడుంటారు అని మీరు తెలుసుకోవాలంటే ఈ వివరణ తెలుసుకోవాలి.

 

ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ఆయన హోటల్స్‌లో బస చేయడానికి ఇష్టపడరని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. బుధవారం జరిగిన సభలో అమిత్ షా ప్రధాని ఖర్చుల గురించి సభకు వివరించారు. విదేశాలకు విమానంలో వెళ్లిన సమయంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఒక చోట ఆగ వలసి వస్తే ఎంత సేపైనా సరే విమానాశ్రయంలోని లాంజ్లోనే ఉంటారు  తప్ప హోటల్స్‌కి వెళ్లడానికి ఇష్టపడరు అని అమిత్ షా చెప్పారు. మోడీ స్నానం కూడా ఎయిర్‌పోర్టులోని వాష్‌ రూమ్స్‌లోనే చేస్తారని చెప్పారు.

 

ఇంధనం నింపడానికి విమానం ఏదైనా ఎయిర్‌పోర్టులో దిగితే కొందరు ప్రధాన మంత్రులు వారి సెక్యూరిటీ మొత్తం దగ్గరలోని ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస చేసేవారని సభకు తెలిపారు అమిత్ షా. మోడీ మాత్రం ఆ పని చేయరని ఎందుకంటే దాని వల్ల మళ్లీ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందనే ఉద్దేశం తనదని అమిత్ షా వెల్లడించారు.

 

ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అతనితో పాటు కేవలం 20 శాతం సిబ్బంది తోడుగా వెళ్తారు అని చెప్పారు. ఇక అధికారుల కోసం పెద్ద సంఖ్యలో కార్ల వినియోగంను కూడా మోడీ ప్రోత్సహించరని చెప్పారు. అంతకు ముందు ప్రధానుల దగ్గర పని చేసిన అధికారులు ఒక్కొక్కరు ఒక్కో కారును వినియోగించేవారని చెప్పారు. ఇప్పుడు ఆలా కాకుండా ఓ బస్సు లేదా పెద్ద వాహనం ఒక్కదాన్నే వాడతారని సభకు గుర్తు చేశారు అమిత్ షా.

మరింత సమాచారం తెలుసుకోండి: