మాజీ ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నేత ఆయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్రమంతా అతనిపై వ్యతిరేక పవనాలు ఉన్న నేపథ్యంలో అతనిలా బయటికి వచ్చి తనపై వస్తున్న ఒక ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తుంటే అవి అతనికి అంత నేరుగా బెడిసి కొడుతున్నాయి. ఈరోజు బాబుకి వ్యతిరేక వర్గాలు అతనిపై చెప్పులు రివ్విన తీరు మరియు కర్రలు విసిరిన సంఘటనలు చూస్తుంటే మరొక ఐదేళ్ళకి బాబు పరిస్థితి ఏంటి అని వారి పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారట.

 

అయితే బాబు మాట్లాడుతూ రాజధాని అమరావతి నుండి మార్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉందా అని ప్రశ్నించడం గమనార్హం. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పష్టమైన సమాధానం లేకుండా మరియు ఆఫీస్ నుండి ఎటువంటి నిర్దేశ పూర్వక వ్యాఖ్యలు రాకుండానే చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్న. ఇకపోతే తాను ఒక సామాజిక వర్గానికి మేలు చేకూరుస్తున్నానని నిందించడం తగదు అని బాబు అంటున్న నేపథ్యంలో అసలు అతని పరిపాలన లో వచ్చినా సామాజిక వర్గ ఆరోపణలను మరియు జగన్ మోహన్ రెడ్డి గారిపై ఉన్న ఆరోపణలను పోల్చి చూసుకొని మాట్లాడాలని సోషల్ మీడియాలో పలువురు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి సలహాలు ఇస్తున్నారు.

 

ఇకపోతే కుటుంబం, బంధువులు మరియు పార్టీ కోసం అతను నగరాలు నిర్మించి లేదు అని చెప్పిన చంద్రబాబు గట్టిగా అమరావతిలో ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని మొన్ననే వచ్చిన సర్వే రిపోర్ట్ తేల్చి చెప్పేసింది. ఇకపోతే అని పై వస్తున్న అవినీతి ఆరోపణలపై మండిపడ్డ చంద్రబాబు అతని పరిపాలన కాలంలో జరిగిన లోగుట్టు వ్యవహారాలు మరియు బయటికి వచ్చిన లెక్కల్లో ఉన్న నొసుగుల గురించి పూర్తిస్థాయిలో బయటపడాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. అప్పటి వరకూ ఆయన ఆగకుండా ఇప్పుడే ఇలా భుజాలు తడుముకోవడం చేస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదూ. ఇలా ఒక రెండు మూడు అంశాలను పట్టుకొని చంద్రబాబు రోడ్డెక్కి రాజకీయం చేస్తూ... ఒక దిశానిర్దేశం అయినా పాయింట్ లేకుండానే వాదించడం చూసి ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: