జగన్ అధికార పీఠం అధిరోహించి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల కాలంలో అన్నీ వర్గాల ప్రజల మద్ధతు పొందడమే లక్ష్యంగా అనేక పథకాలు, నిర్ణయాలు అమలు చేశారు. ఇక వీటి వల్ల రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రజలు జగన్ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ తనకు యాంటీగా ఉన్న సామాజికవర్గాన్ని కూడా దగ్గర చేసుకునేందుకు సరికొత్త వ్యూహం వేశారు. ఎప్పుడు టీడీపీకి అండగా ఉండే  కమ్మ సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు జగన్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేశారు.

 

అందులో భాగాంగనే టీడీపీలో స్ట్రాంగ్ గా ఉన్న కమ్మ నేతలని వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి బలమైన నాయకులని చేర్చుకున్న జగన్...మరికొందరు కమ్మ నేతలని చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టీడీపీకి చెందిన కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.

 

ఇక ఈ చేరికల్లోనే కాకుండా కమ్మ ఓటర్లని ఆకట్టుకునేందుకు జగన్ వారికి ఓ ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై విధివిధానాలని ఖరారు చేసుకుని...కమ్మ వర్గంలో ఉన్న పేదలని ఆదుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఈ కార్పొరేషన్ ఛైర్మన్ గా వైసీపీలో తనకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యేని నియమించాలని భావిస్తున్నారు. ఇక ఈ కార్పొరేషన్ సెట్ అయితే కమ్మ ఓటర్లు కొంతవరకు జగన్ పట్ల పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది.

 

తమ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు ఇన్నేళ్లు అధికారంలో చేయలేని పని జగన్ చేశారని అభిమానం కూడా పెరిగే అవకాశముంది. ఇక కమ్మ ఓటర్లు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపితే అసలే కష్టాల్లో టీడీపీకి ఇంకా పెద్ద ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీని కోలుకోకుండా చేసి జగన్ మళ్ళీ జయభేరి మ్రోగించవచ్చు. మరి ఈ వ్యూహాలన్నీ సక్సెస్ అవుతాయో లేదో రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: