గత కొంతకాలంగా టిడిపి పార్టీకి గడ్డుకాలం ఏర్పడిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ నేతలు అందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు.సమయం  ఎప్పుడు వస్తుందా ఎప్పుడు టిడిపి నుంచి ఎగిరి  పోదామా అన్నట్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ లోకి కీలక నేతలైన  ఇద్దరు ఎంపీలు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.ఇక  బీజేపీ పార్టీలో అత్యంత కీలక నేత అయిన  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఎన్నో విమర్శలు చేయడంతో టీడీపీ అధినేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

 

 

 

 అయితే టిడిపి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని సస్పెండ్ చేసిన తర్వాత...వంశీ  రెండుసార్లు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం... త్వరలోనే వంశీ  వైసీపీ కండువా కప్పుకోనున్నాడు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి నుంచి ఏ నేత వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరుతారో అని  చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి త్వరలోనే మరో వికెట్ పడబోతుంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నేడు కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మాత్రం అనిల్ కుమార్ వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 

 

 

 

 టిడిపి నుంచి మరో వికెట్ పడనుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్ చేయడం తో టీడీపీ కి గుడ్ బై  చెప్పబోయే ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు ఆసక్తిగా మారింది. ఏపీ మంత్రులు కొందరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి . త్వరలోనే టిడిపికి గుడ్ బై  చెప్ప బోయే ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయనే  వార్తలు  ఊపందుకున్నాయి . ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబు పార్టీకి గడ్డుకాలం ఏర్పడిందని చెప్పాలి రాష్ట్రంలో టిడిపి పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. జగన్ విమర్శించేందుకు ఓ వైపు చంద్రబాబు సన్నద్ధమవుతోంటే  మరోవైపు టీడీపీ నేతలు కొందరు పార్టీని వీడుతుండటంతో  చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: