అనుకుంటాం కానీ వరాలు ఇచ్చే వేలుపులు ఎక్కడో ఉండరు. మన కళ్ళ ఎదుటే రాజకీయ నాయకుల రూపంలోనే ఉంటారు. ఒక్కసారి కుర్చీ పట్టిన తరువాత వారంత దానకర్ణులు ఎవరూ వేరే ఎవరూ ఉండరు. అందుకే అలా చేతికి ఎముకే లేనట్లుగా దయ చూపించేస్తారు. ఇక జీవితంలో ఎక్కక్క ఎక్కక కుర్చీ ఎక్కిన ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ప్రజలకు అనేక  వరాలు సులువుగా ఇచ్చేశారు.

 

 
రూపాయికే క్లినిక్ లో వైద్యం తో పాటు పది రూపాయలకే బోజనాన్ని ఇచ్చే స్కీములు అమలు చేస్తామని ఉద్ధవ్ థాక్రే హామీ ఇచ్చేశారు. అదే విధంగా నిరుద్యోగాన్ని తగ్గించేందుకు 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా చట్టంలో మార్పులు తెస్తామని కూడా ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అదే విధంగా రైతులకు తక్షణం రుణ మాఫీ చేయాలని కూడా నిర్ణయించారు.

 

ఇక కామన్ మినిమం ప్రొగ్రాం పెట్టుకుని అమలు చేయాలని కూడా నిర్ణయించారు.  మొత్తానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మూడు కలసి కొత్త ప్రభుత్వాన్ని ఈ రోజు కొలువు తీరేలా చేసాయి. కాంగ్రెస్ కి చెందిన అగ్ర నేతలతో పాటు, ఎన్సీపీ నేతలు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు  ఉద్ధవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఇదిలా ఉండగా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉధ్ధవ్ థాక్రేని ప్రధాని మోడీ అభినందించారు. ఆయన పాలనలో మహారాష్ట్ర అభివ్రుధ్ధి వేగంగా సాగుతుందని కూడా ప్రధాని ఆకాంక్షించారు. మొత్తానికి మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా థాక్రే ప్రమాణం చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున శివసైనికులు హాజరయ్యారు.

 

ఇదిలా ఉండగా ఎన్నికలు జరిగిన యాభై రోజుల తరువాత మాహారాష్ట్రలో కొత్త సర్కార్ కొలువు తీరడం శుభపరిణామంగా ఉంది. అదే సమయంలో మూడు విభిన్న కూటముల సారధ్యంలో ఏర్పాటైన ఉద్ధవ్ థాక్రే సర్కార్ ఎన్నాళ్ళు ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బాల థాక్రే కుటుంబం నుంచి తొలిగా ప్రభుత్వ పదవుల్లోకి వచ్చిన నేతగా ఉద్ధవ్ రికార్డ్ స్రుష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: