లోక్‌సభలో  ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కామెంట్స్‌పై  పెద్ద దుమారమే రేగింది. గాడ్సే దేశ భక్తుడని వివాదస్పద కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ చర్యలు చేపట్టింది. రక్షణ శాఖ కమిటీ నుంచి, లోక్‌సభ సంప్రదింపుల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. ఈ శీతాకాల సమావేశాల నుంచి ఎంపీ ప్రజ్ఞాని సస్పెండ్ చేస్తున్నట్టు లోక్ సభ ప్రకటించింది. ఆమెపై పార్టీపరమైన చర్యలుంటాయని జేపీ నడ్డా ప్రకటించగా, ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి.


భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఈ వ్యాఖ్యలు లోక్‌ సభను కుదిపేశాయి. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు వేసింది. ఢిఫెన్స్ ప్యానల్ నుంచి కూడా ఆమెను తొలగించింది. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కానీయకుండా చూసుకోవాలంటూ హెచ్చరికలు చేసింది. 

 

ప్రజ్ఞా ఠాకూర్ తీరుకు నిరసనగా విపక్షాలు లోక్‌ సభ నుంచి వాకౌట్ చేశాయి.  ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె చేసిన కాంమెంట్స్ పై స్పందించి తన సమయాన్ని వృథా చేసుకోనన్నారు. ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తమ పార్టీ అటువంటి వ్యాఖ్యలను సహించబోదని ఆయన స్పష్టం చేశారు. 

 

మరోవైపు భోపాల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సొంత పార్టీ ఎంపీ వ్యాఖ్యలను తప్పు పట్టారు. నాథూరాం గాడ్సేను దేశభక్తుడనే ఆలోచనకు స్వస్తిపలకాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు..  గాంధీ మనందరికి ఆదర్శప్రాయుడని తేల్చి చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: