ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టిన అది అట్టర్ ఫ్లాప్ గానే మిగులుతుంది. ఆయన కార్యక్రమాలకి ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచే స్పందన కరువుతుంది. ఇటీవల ఆయన రాష్ట్రంలో ఇసుక కొరతపై 12 గంటల దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు ప్రజల నుంచి స్పందన పెద్దగా రాలేదు. అలాగే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు కూడా చాలావరకు హాజరు కాలేదు. ఇక తాజాగా బాబు అమరావతిలో పర్యటించారు. దీనికి ప్రజల నుంచి స్పందన రాకపోగా, నిరసన సెగ గట్టిగా తగిలింది.

 

ఐదేళ్లు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చేసి తమని మోసం చేశారని కొందరు రైతులు బాబు పర్యటనపై ఆందోళనలు చేశారు. ఈ విషయం పక్కనబెట్టేస్తే బాబు పర్యటనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొందరు హాజరు కాలేదు. ఇప్పటికే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లనుండటంతో ఆ పార్టీకి 22 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, సినిమాల్లో బిజీగా ఉన్న బాలయ్య వెళ్లలేదు.   ఇటు ప్రకాశంలో గొట్టిపాటి రవికుమార్ కూడా డుమ్మా కొట్టేశారు. ఈయన త్వరలోనే వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

 

అటు గుంటూరులో అనగాని సత్యప్రసాద్ ఎప్పటి నుంచో అడ్రెస్ లేరు. ఇక కృష్ణాలో గద్దె రామ్మోహన్ విదేశాల్లో ఉన్నారు. అదేవిధంగా విశాఖలో గంటా శ్రీనివాసరావు బ్యాచ్ అడ్రెస్ లేరు. వీరు బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీకాకుళంలో బెందళం అశోక్ కూడా హాజరు కాలేదని తెలుస్తోంది. మొత్తం మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలే బాబు పోరాటాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

 

అయితే అటు బాబు ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజల నుంచి స్పందన రాకపోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. పైగా ఆరు నెలల్లో అంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేయలేదు. అయిన కొత్త ప్రభుత్వానికి ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా బాబు ఆందోళనలు చేసేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు చంద్రబాబు పట్ల నెగిటివిటీ పెంచేలా చేస్తున్నాయి. అందుకే బాబు ఏం చేసిన అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: