తాజాగా ఫోర్బ్స్  ప్రపంచంలోనే సంపన్న జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశంలోని సంపన్నుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ సామ్రాజ్య అధినేత ముకేష్ అంబానీ తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో  టాప్ టెన్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. రిలయన్స్ వ్యాపార అధినేత ముఖేష్ అంబానీ తాజాగా ఫోర్స్ విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 10 లోకి దూసుకెల్లి 9 వ స్థానం సొంతం చేసుకున్నాడు . రిలయన్స్ సంపద ఈరోజు 10 కోట్ల మార్కను అందుకోవడంతో ఓకేసారి  అంతర్జాతీయ కుబేరులు జాబితాలో  ఒక్కసారిగా నాలుగు స్థానాలు పైకి ఎగబాకి 9 va స్థానంలో నిలిచారు . ప్రపంచ ఆర్థిక లావాదేవీలు... వాణిజ్య  పరిణామాల ఆధారంగా ఫోర్స్ ప్రపంచ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. 

 

 

 

 అయితే ప్రపంచ లావాదేవీలు వాణిజ్య పరిణామాల ఆధారంగా ఫోర్స్ ఎప్పటికప్పుడు ప్రపంచ సంపన్నుల రియల్ టైం ర్యాంక్స్ ను  ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా  ప్రకటించిన  రాంకుల్లో ... ముఖేష్ అంబానీ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ స్థానంలో నిలిచారు. దీంతో టాప్ టెన్ లోకి చేరిపోయారు ముఖేష్ అంబానీ. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ... గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, సెర్గీ బిర్గ్  వెనక్కి నెట్టి ముందుకు దూసుకు పోయారు.  లారీ పేజ్ సంపద 59.6 బిలియన్ డాలర్లు కాగా ఫోర్బ్స్  జాబితాలో ముఖేశ్ సంపదను 60.7 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. భారతదేశ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉండే ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ టెన్  లోకి వెళ్ళిపోయారు. 

 

 

 

 రిలయన్స్ క్యాపిటలైజేషన్  పదిలక్షల మార్కును దాటడం తో ముఖేష్ అంబానీ సంపద విలువ 60 బిలియన్ డాలర్లు దాటింది.కాగా ఈ  ఏడాది ముఖేష్ అంబానీ సంపద విలువ 15.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తంగా తొమ్మిదేళ్లలో  ముఖేష్ అంబానీ సంపద విలువ డబుల్ అయింది. కాగా ఫోర్బ్స్  ప్రకటించిన ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 3లో  జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, 113 బిలియన్ డాలర్లు, ఎల్విఎంహెచ్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్. బిల్ గేట్స్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: