ఏపీలో తెలుగుదేశం క్యాడర్ లో రోజు రోజుకి ఆందోళన పెరిగిపోతుందా...? అంటే అవుననే సమాధానం ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగాజారుగుతుంది అనే ఆందోళన క్యాడర్ లో ఎక్కువగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం జగన్ పై ప్రజల్లో నమ్మకం ఎక్కువగా పెరగడమే అంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

 

అన్ని సామాజిక వర్గాలకు, అన్ని వర్గాలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. దీనితో ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయిదేళ్ళు ఆగి అమలు చేసిన కార్యక్రమాలను జగన్ త్వరగా అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అగ్రీ గోల్డ్ వాళ్లకు అధికారంలోకి రాగానే డబ్బులు ఇచ్చారు. ఇక రైతు భరోసా, వాహన మిత్ర వంటి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కాని చంద్రబాబు మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అదికూడా అరకొరా అమలు చేయడానికి దాదాపు నాలుగేళ్ళకు పైగా పట్టింది.

 

దీంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనే ఆందోళన క్యాడర్ లో ఎక్కువగా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నాయకత్వ లోపం ఉన్న పార్టీని చంద్రబాబు ఏ విధంగా జగన్ ని దాటి ముందుకి నడిపిస్తారు అనే ప్రశ్న ఆ పార్టీ క్యాడర్ లో ఎక్కువగా వినపడుతుంది. ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకపోయినా సరే ఇప్పుడు చంద్రబాబు వ్యూహాలు జగన్ ముందు పని చేసే పరిస్థితి లేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇక లోకేష్‌ను న‌మ్ముకుంటే మ‌రో ప‌దేళ్ల‌కు కూడా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కాలు ఎవ్వ‌రికి లేవు. అందుకే వాళ్లంతా టెన్ష‌న్‌తో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా వాస్తవాలు మాత్రం క్షేత్ర స్థాయిలో ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: