బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని కలిసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయనకు వివరించారు.  తెలుగుదేశం నేతలపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులు వైసీపీ చెప్పినట్టు విని తమను ఇబ్బంది పెడుతున్నారని, ఇక రాష్ట్రంలో కొన్ని పరిణామాలు తీవ్రంగా ఉన్నాయని అమిత్ షా కు తెలుగుదేశం ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు రాసిన లేఖను కూడా ఆయనకు అందించారు ఎంపీలు.

 

 పార్లమెంటరి పార్టీ నేత,  గల్లా జయదేవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, తోట సీతారామలక్ష్మి పార్లమెంటు భవన్‌లోని అమిత్‌ షా చాంబర్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా అమిత్ షా ఏం స్పందించారో తెలియదు గాని తెలుగుదేశ౦ మాత్రం కాస్త ఎక్కువగానే ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ పార్టీ అనుకూల పత్రికల్లో... రాష్ట్రంలో ఏం జరుగుతుందో తనకు తెలుసు అంతా తాను చూసుకుంటా అని అమిత్ షా వ్యాఖ్యానించారని, మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలవోచ్చని ఎంపీలతో ఆయన అన్నారని ఓ క‌థ‌నం రాసింది.

 

అక్క‌డ ఏం జ‌రిగినా.. అమిత్ షా వీళ్ల‌కు ఎక్కువ టైం ఇవ్వ‌క‌పోయినా ఇక్క‌డ అనుకూల పేప‌ర్ల‌లో రాసుకునేది మాత్రం వేరుగా ఉంటోంది. దీంతో టీడీపీ కేడ‌ర్‌ ఎక్కువ ఊహించుకోవడం మొదలుపెట్టారు. కేంద్రం జగన్ కి చెక్ పెడుతుందని ఆయన బెయిల్ రద్దు అవుతుందని, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎంపీలతో అమిత్ షా అన్నారని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పేపర్ క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక పక్క పార్టీ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని నేతలు, కార్యకర్తలు ఇలాంటి ప్రచారాలు చేసుకుంటూ ఎక్కువ ఊహించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది టీడీపీ వాళ్ల డ‌బుల్ ఓవ‌ర్ యాక్ష‌న్ అని పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: