చంద్రబాబు మళ్ళీ అమరావతి అని గర్జించారు. అమరావతి ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడా పెద్దగా పేరు వినబడని సంగతి తెలిసిందే. జగన్ ప్రయారిటీస్ నవ రత్నాలు. వాటి అమలు మీద జగన్ ఎక్కువగా  ద్రుష్టి సారించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఇపుడు అమరావతి పేరుని ఇండియా మ్యాప్ లో మళ్ళీ సవరణతో సహా  వచ్చేలా చూడగలిగారు. అదే సమయంలో  గొప్ప వ్యూహాత్మకంగా అమరావతి టూర్ పెట్టుకున్నారు.

 

అమరావతిలో చెప్పులు పడాలని గోల జరగాలని కూడా బాబు కోరుకున్నారు. ఆ విధంగానే జరిగింది. బాబు ఇలా వచ్చి ఆలా వెళ్ళిపోతే సందడేముంటుంది. అందువల్ల బాబు కోరుకున్నట్లుగానే  గొడవ చేసి మరే వైసీపీ ఆయన ట్రాప్ లో పడిపోయింది. ఇక బాబు మార్క్ యాక్షన్ ఎటూ ఉంది. ఆయన మొదలెట్టేశారు కూడా.

 

అమరావతి రాజధానినికి శంఖుస్థాపన చేసిన నేలను ముద్దాడడం ద్వారా బాబు సెంటిమెంట్ ని రాజేశారు. ఏకంగా సాష్టాంగం పడిపోయి మరీ నమస్కారం చేయడం ద్వారా ఇది తన అమరావతి, తన కలల రాజధాని అని రుజువు చేసుకున్నారు. అమరావతి మీద అన్ని హక్కులు తనకే ఉన్నాయని బాబు ఆ విధంగా చెప్పుకున్నారు.

 


ఇక అమరావతి విషయంలో జగన్ని ఆయన అక్కడ నుంచే సవాల్ చేశారు. అమరావతిని ఇక్కడ నుంచి తరలించే ధైర్యం మీకు ఉందా అంటూ వైసీపీ సర్కార్ ని సూటిగా ప్రశ్నించారు. అమరావతి విషయంలో తాను తప్పు కనుక చేస్తే ప్రజలకు జవాబు చెబుతానని బాబు మరో విధమైన భావోద్వేగాన్ని  రెచ్చగొట్టారు.

 


తాను ప్రజలే కుటుంబం అనుకుని అమరావతి రాజధాని నిర్మించాలని చూస్తే అది ఒక్క సామాజికవర్గం రాజధాని అంటారా అంటూ బాబు హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి అమరావతి రాజధాని అంటూ  పెద్దగా ఏమీ లేదు, కానీ అది ఉన్నట్లుగా, జగన్ వచ్చి సర్వనాశనం చేసినట్లుగా చంద్రబాబు ఇన్నాళ్ళు ఇస్తున్న బిల్డప్పులకు వైసీపీ చేసిన రచ్చతో మరింత రక్తికట్టినట్లైంది.  అమరావతిని అక్కడ నుంచి జగన్ ఇపుడు తరలించలేడని బాబుకు తెలుసు. ఇక ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం కోసమే బాబు ఈ టూరు పెట్టుకున్నారని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: