తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ స‌మ్మెకు మాస్ట‌ర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒకే దెబ్బ‌కు ఇటు కార్మికుల‌ను అటు యూనియ‌న్లు-విప‌క్షాల నేత‌ల‌కు షాక్ ఇచ్చారు. కార్మికుల‌కు తీపిక‌బురుతో....యూనియ‌న్లు, విప‌క్షాల‌కు ఎత్తుగ‌డ‌ల‌తో షాక్‌లు ఇచ్చారు. ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ నిర్ణయించింద‌ని తెలిపిన కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు శుక్ర‌వారం ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ``ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకుల మాటలు పట్టి ఆగం అయ్యారు. అనాలోచిత సమ్మె వాళ్ళ వల్లే వచ్చింది. టెంట్ కనబడితే చాలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళు పాలించే ఏ రాష్ట్రంలో కూడా విలీనం చెయ్యలేదు. వాళ్ళను రోడ్ పాలు చేసింది కూడా వాళ్ళే. జాయిన్ కావాలి అని నేను చెప్పాను  వారు మాత్రం లైట్ తీసుకున్నారు. ప్రతిపక్ష నేతలు చెప్పిన మాటలు నమ్మి రోడ్ మీద పడ్డారు. యూనియన్ నాయకులు వల్లే ఈ పరిస్థితి వచ్చింది` అని మండిప‌డ్డారు. 

 

తాము ఆర్టీసీ నాయకులు పొట్ట కొడుతున్నామ‌నేది వితండా వాదమ‌ని కేసీఆర్ అన్నారు. ``ఇక్కడ న‌లుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. ప్రైవేటీకరణ చట్టంకు వీరు ఓటు వేశారో లేదో ప్రజలకు చెప్పాలి. అయినా ఇంకా కార్మికులను మభ్యపెదుతున్నారు. ఇంకా కేంద్ర లో మీకు న్యాయం చేస్తాం అని చెప్తున్నారు కేంద్రం వాటా పై కూడా మేము కోర్ట్ కు పోతాం. రేపు నోటీస్ లు ఇస్తాం.` అని కేంద్రానికి షాక్ ఇచ్చారు రాజకీయ చలి మంటలు కపుకోవడం తప్ప వీల్లు స‌హాయానికి ముందుకు వస్తారా అని ప్ర‌శ్నించారు. ``కార్మికుల బ్రతుకులతో ఆదుకోవడం కరెక్టేనా? ఇప్పటి కైనా ఆర్టీసీ కార్మికులు జాయిన్ కావాలి .ఇప్పుడే కార్మికుల జాయిన్ చేసుకోవాలని చెప్తున్నా. మీ ఆర్టీసీ సంస్థ మనది మనలో భాగమే `` అని కార్మికుల‌కు తీపిక‌బురు చెప్పారు.  

 

సమ్మె స‌మ‌యంలో చనిపోయిన కార్మికుల యొక్క‌ కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఇస్తాం,తక్షణ సహాయం చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ``మమ్ములను ఇష్టం వచ్చినట్టు తిట్టారు అయినా మేం పట్టించుకోం. క్రమశిక్షణతో ఉంటే సింగరేణి ఏవిదంగా అభివృద్ధిలోకి తెచ్చామో అలాగే అభివృద్ధి చేస్తాం. త్వరలో ప్రతి ఆర్టీసీ డిపో నుండి 5 ని పిలిచి మాట్లాడుతా..ప్రతి అంశంపై క్షుణ్ణంగా వివరిస్తా...నేను ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు లాభాల బాటలో తెచ్చాను. క్రమశిక్షణ తో ఉంటే మీకు మంచి చేస్తాం. అద్భుతమైన ఆర్టీసీ గా నడుపుతాం. నా మాట వింటే మీకు బోనస్ వస్తుంది . అనుభవం ఉన్నవారిని డీఎంలు పిలుస్తారు మీరు రండి మంచిగా చెప్పుకుందాం. కార్మికుల‌ స‌మ‌స్య‌ల కోసం సీనియర్ మంత్రిని బాధ్యుడిగా పెడుతాను.వారితో మీకు ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు వీలు ఉంటుంది`` అని ప్ర‌క‌టించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: