తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసి కార్మికులకు శుభవార్త అందించింది. రేపటి నుంచి ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరవచ్చని సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఆర్టీసి భవితవ్యం పై సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో సీఎం కెసిఆర్ ఆర్టీసి ని బతికించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది అని అని సీఎం కెసిఆర్ చెప్పారు. 

 

ఇంత కఠినంగా వ్యవహరించింది అందుకే 

 

ఆర్టీసి బలోపేతం అవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్టీసి సంక్షోభంలో ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసి ని బతికించామని సీఎం కెసిఆర్ గుర్తు చేశారు. ఇక ఆర్టీసిని బతికించడానికి ఏం చర్యలు తీసుకోవాలో తానే ప్రతీ డిపోకు వచ్చి కార్మికుల నుంచి సలహాలు స్వీకరిస్తానని పేర్కొన్నారు సీఎం. కార్మికులను అనవసరంగా విపక్షాలు రెచ్చగొడుతున్నాయని సీఎం చెప్పారు. 

 

ఇక పై ఆర్టీసి లో యూనియన్స్ ఉండవు 

 

ఆర్టీసి కార్మికులు ఇంత భాధ పడి రోడ్డున పడడానికి యూనియన్స్ కారణమని సీఎం అన్నారు. అమాయక కార్మికులు యూనియన్స్ మాట విని మోసపోయారని, సమ్మె చట్ట విరుద్ధమని ముందు నుంచే చెప్తున్నాం, ఇక లేబర్ కోర్టు లో ఇదే విషయం డిక్లేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కార్మికులను నట్టేట ముంచిన యూనియన్లు ఇకపై ఆర్టీసీలో ఉండవు. యూనియన్లు లేకపోతే కార్మికుల సమస్యలు ఎలా తీరుతాయని ఆందోళన అవసరం లేదు యూనియన్ల స్థానంలో వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేస్తాం. దీనికి ఒక మంత్రి ని సహాయకుడిగా నియమించి ఆర్టీసి కార్మికుల బాగోగులు చూసుకుంటాం అని సీఎం చెప్పారు. 

 

"చనిపోయిన కార్మికులకు ఆర్ధిక సాయం చేస్తాం, వారి ఇంట్లో వారికి విద్యార్హతను బట్టి తగిన ఉద్యోగం ఇచ్చి కార్మిక కుటుంబాలను ఆదుకుంటాం. కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం" అని సీఎం కెసిఆర్ చెప్పారు. అత్యంత ఆసక్తి గా ఎదురు చూసిన ఆర్టీసి కార్మికులకు ఒక గుడ్ న్యూస్ అందించారు సీఎం కెసిఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: