తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బలహీనపడే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా ఇప్పుడు బలంగా ఉన్న ఆయన్ను కేంద్రం టార్గెట్ చేసే రోజు దగ్గరలోనే ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. మహారాష్ట్రలో బిజెపి అధికారం చేపట్టాలని భావించి కంగుతింది. దీనితో బిజెపి చేతిలో ఉన్న ఒక్కో రాష్ట్రం చేజారిపోతుంది. ఝార్ఖండ్ లో బిజెపి ఓటమి పాలయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అక్కడి ప్రజల్లో ఇప్పుడు బిజెపి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. 

 

దీనితో దక్షిణాదిలో తన ప్రాభవాన్ని పెంచుకునే ఆలోచనలో బిజెపి ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే మహారాష్ట్ర లాంటి రాష్ట్రం చేజారిపోతే ఇప్పటికే ఆర్ధిక కష్టాల్లో ఉన్న కేంద్రానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దేశ ఆర్ధిక రాజధానిగా ఉన్న ముంబై చేజారిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ మీద బిజెపి కన్నేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ప్రముఖ సంస్థలకు, అనేక పరిశ్రమలకు హైదరాబాద్ నిలయంగా ఉంది. దీనితో ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వెళ్ళే అవకాశం ఉంది. దీనితో దానిని తమ వైపు మల్లించుకునే ఆలోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. ముందు కెసిఆర్ ని బలహీనపరచడానికి గాను హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే కేంద్రం ఈ  ప్రక్రియను మొదలుపెట్టే ఆవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇందుకోసం రాజకీయంగా కెసిఆర్ ని బలహీనపరిచే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే కొంత మంది ఎమ్మెల్యేలను తెరాస నుంచి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బిజెపి పెద్దలు దీనికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ ని కూడా సిద్దం చేశారని అంటున్నారు. ఒకవేళ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయితే మాత్రం కెసిఆర్ కి దెబ్బే అంటున్నారు. మ‌రి రాజ‌కీయంగా ఎత్తుల‌కు పై ఎత్తులు వేసే కేసీఆర్ బీజేపీ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: