తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో రోడ్లు బాగా దెబ్బ తిన్నాయని చెప్పారు. కేబినేట్ సమావేశంలో రోడ్ల గురించి సుదీర్ఘంగా చర్చించామని కేసీఆర్ తెలిపారు. కేబినేట్ 571 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రోడ్ల మరమ్మత్తులకు కేటాయించేందుకు ఆమోదం తెలిపిందని కేసీఆర్ చెప్పారు. 
 
రెండు మూడు నెలల్లో రోడ్ల మరమ్మత్తులు టెండర్లను పిలిచి పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రేపు ఉదయం నుండి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరవచ్చని ఆర్టీసీకి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. తాము పేదల ప్రయోజనం కోరుకుంటామే తప్ప ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టబోమని కేసీఆర్ అన్నారు. యూనియన్ల మాటలు నమ్మి ఆర్టీసీ కార్మికులు దెబ్బ తిన్నారని కేసీఆర్ అన్నారు. 
 
యూనియన్లు, ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించాయని కేసీఆర్ అన్నారు. మరోవైపు ప్రయాణికులకు మాత్రం సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. కిలో మీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. త్వరలో ప్రగతి భవన్ కు కార్మికులను పిలుస్తానని కేసీఆర్ చెప్పారు. యూనియన్ నేతలను క్షమించం, రానివ్వమని కేసీఆర్ చెప్పారు. 
 
చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో కార్మికులు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ఆకాంక్షలకు తగినట్లు పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళతామని కార్మికులు చెబుతున్నారు. శుక్రవారం రోజున అన్ని డిపోల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని కార్మికులు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులందరూ విధుల్లోకి చేరవచ్చని చెప్పటంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: