దాదాపు 52 రోజులు కష్టపడ్డారు.. రాజు చాలా మొండోడు అని అర్థం చేసుకున్నారు. ఇంకా అయ్యేది కాదు అని ఆ కష్టానికి ఉన్న నాయకుడు సైతం వెనకడుగు వేశాడు.. ఇంకా దీంతో చేసేది ఏమి లేక రాజు గారు మమ్మల్ని క్షేమించండి అన్నారు.. కానీ ఆ రాజు చాలా కోపంగా ఉన్నాడు. 

 

అందుకే ఆ కార్మికులను మూడు రోజులు ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశంతో కార్మికులు అంత ఇప్పుడు పండుగా చేసుకుంటున్నారు. మరి ఈ అవకాశాన్ని ఆ కార్మికులు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. అసలు ఆ రాజు ఏ అవకాశం ఇచ్చాడు ? ఆ కార్మికులు ఎవరు ? ఆ రాజు ఎవరు ?

 

ఇప్పటికే మీకు ఆ రాజు ఎవరు.. ఆ నగరం ఏంటి ? ఆ సమస్య ఏంటి ? ఆ కార్మికులు ఎవరు అనేది ఇప్పటికే తెలుసుంటుంది. ఆ నగరం తెలంగాణ.. ఆ రాజు కేసీఆర్.. ఆ కార్మికులు ఆర్టీసీ కార్మికులు.. సమస్య ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆ శుభవార్త ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. 

 

వారికి మరో ఛాన్స్‌ ఇస్తున్నామని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. యూనియన్ల కారణంగానే అసంబద్ధ డిమాండ్లతో కార్మికులు ఆర్టీసీ సమ్మెకు దిగారని సీఎం కేసీఆర్‌ అన్నారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారని, విపక్షాల మాటలు నమ్మొద్దని.. విధుల్లో చేరాలని తాను స్వయంగా విజ్ఞప్తి చేశానని ఆయన గుర్తు చేశారు. 

 

ప్రగతి భవన్‌లో మీడియాతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే అని ఆయన స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆయా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు లేని ఆశలను కార్మికుల్లో కల్పించాయని మండిపడ్డారు. ఏది ఏమైనా ఈ వార్త ఆర్టీసీ కార్మికులకు శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: