తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చారు.  సమ్మె విరమించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి.  ఈ నిర్ణయంతో కార్మికుల హృదయాల్లో కెసిఆర్ దేవుడు అయ్యాడు. అల్లా అయ్యాడు జీసెస్ అయ్యాడు.. ఎవరు ఎలా పూజించుకుంటే అలా అయ్యాడు.  మరి ఎందుకు సమ్మె విరమించినరోజే విధుల్లోకి తీసుకోలేదు అంటే దానికి కారణం ఉన్నది.  
ఒకవేళ సమ్మె విరమించిన వెంటనే నిర్ణయం తీసుకుంటే.. ఫలితం మరోలా ఉంటుంది.  భవిష్యత్తులో మరెప్పుడైనా మరలా సమ్మె చేయడానికి కార్మికులు సిద్దముగా ఉంటారు.  అప్పుడు వచ్చే ఇబ్బందులు వేరుగా ఉంటాయి.  అందుకే సమ్మె విరమించిన తరువాత రెండు రోజులపాటు కావాలని హైడ్రామా నడిపారు.  ఉద్యోగం విలువ తెలియాలని, సమ్మె ప్రజలు పడుతున్న కష్ట నష్టాల విలువ తెలియాలని అలా చేశారు. అలా చేయడం వలన వారికీ కొంత తెలిసి వస్తుంది.  
అందుకే కెసిఆర్ అలా చేసారని అనుకోవచ్చు.  ఇకపోతే, తక్షణమే ఆర్టీసీకి రూ. 100 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది.  ఇప్పుడు ఆర్టీసీని తిరిగి లాభాల్లో నడిపించాలి అంటే కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచాలి.  ఇలా పెంచడం వలన కనీసం సంవత్సరానికి రూ. 790 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది.  ఈ ఆదాయంతో కొంతమేర నష్టాలను పూడ్చుకోవచ్చు.  
ఇక ఇదిలా ఉంటె, ఆర్టీసీని నష్టాల నుంచి పూడ్చాలి అంటే ప్రయాణికులపై భారం మోపం ఒక్కటే చేయాలా అంటే అలా చేస్తూనే సరకు రవాణా విషయంపై కూడా కొంతమేర ఆర్టీసీ దృష్టి పెట్టాలి.  అదే విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ సర్వీసులు నడుపుతున్నారు.  ఈ సర్వీసుల కారణంగా ఆర్టీసీకి చాలా వరకు నష్టం వస్తున్నది.  ముందు వాటిని అరికట్టాలి.  ప్రైవేట్ బస్సులను అదుపుచేయగలిగితే.. ఆటోమాటిక్ గా ఆర్టీసీకి కొంతమేర లాభం వస్తుంది.  లాభం రాకపోయినా సరే నష్టాల నుంచి వీలైనంత త్వరగా బయటపడుతుంది.  మరి కెసిఆర్ అలా చేస్తారంటారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: