అసిస్టెంట్ వెట‌ర్న‌రీ స‌ర్జ‌న్ ప్రియాంక హత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్రియాంకరెడ్డి హత్య ఘటన సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. శంషాబాద్‌లో నివాసముండే ప్రియాంకరెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా నావాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామంలో అసిస్టెంట్‌ వెటర్నరీ సర్జన్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకువచ్చిన అనంతరం రాత్రి ఆమె ఇంటి నుంచి బయల్దేరి గచ్చిబౌలికి వెళ్లారు. శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద స్కూటీని ఆపి క్యాబ్‌లో గచ్చిబౌలి వెళ్లారు. చికిత్స కోసం గచ్చిబౌలిలోని చర్మవ్యాధుల వైద్యుడి వద్దకు వెళ్లింది. రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు చేరుకుంది. ఆమె వెహికల్‌ టోల్‌ప్లాజా వద్దకు వచ్చేసరికి ఎవరో వ్యక్తి బండి పంక్చర్‌ అయినట్లు చెప్పాడు. ఆ వ్యక్తే బండిని పంక్షర్‌ చేయించుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె అక్కడే నిరీక్షిస్తూ ఉంది. అనంత‌రం హ‌త్య‌కు గుర‌య్యారు.

 

అయితే, ఈ దారుణ ఘ‌ట‌న నేప‌థ్యంలో...రాచకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహ‌నం రిపేర్ కార‌ణంగానే...ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో...మహిళల భద్రత కోసం ఓ లెటర్ రిలీజ్ చేశారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్ రాత్రి వేళల్లో  ఏ సమయంలోనైనా బైక్ రిపేర్లు వస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు. 9490617111 అనే వాట్సప్ నెంబర్ కు లొకేషన్ ను షేర్ చేయాలని కోరారు. దగ్గరలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మహిళలకు సాయం చేస్తారన్నారు.

 

ఇదిలాఉండ‌గా,  ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ప్రియాంకరెడ్డి హత్య ఘటనపై సీపీ మీడియాతో మాట్లాడారు. ``ప్రియాంకరెడ్డిని ఎవరు తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు అక్కడ ఉన్నవారిని విచారించాం. కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి. ఇది తెలిసినవారు చేశారా? లేదా లారీ వాళ్ల పనా? అనే కోణంలో పరిశీలిస్తున్నాం. త్వరలోనే ఈ కేసును పరిష్కారిస్తాం`` అని  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: