దివంగత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ఏపీ సీయంగా  బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పధకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. వేయి రూపాయాలు దాటిని ప్రతీ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని ఇప్పటికే  సీఎం జగన్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా విధి విధానాలు ఖరారు చేసారు.

 

 

ఇప్పటికే ఏపీలో అందని వైద్యం తమిళనాడు.. కర్నాటక.. తెలంగాణ కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఇదే సమయంలో డిసెంబర్ 21 నుండి వైయస్సార్ ఆరోగ్యశ్రీ ని పూర్తి స్థాయిలో అందించేందుకు అడుగులు వేస్తోంది. ఎవరు ఈ స్కీం కింద అర్హలనేది వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

 

 

ఇకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి సంబంధించిన  ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే ఆరోగ్యశ్రీలో భాగంగా శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారికి ఆర్థికసహాయం చేసేందుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

 

ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ  కార్డు ఉపయోగించుకొని  శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి.. డిసెంబర్‌ 1 నుంచి రోజుకు రూ. 225, లేదా నెలకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందివ్వాలని నిర్ణయించారు ఈ క్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ పేదలకు సాయం అందించాలని ఆదేశించారు. ఇకపోతే ఈ పధకంలో భాగంగా అందే నగదును  లబ్దిదారులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే నేరుగా అకౌంట్‌లో వేయాలని ఆదేశించారు.

 

 

ఇక ఈ పధకం 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి వర్తిస్తుందని తెలిపారు. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ  తాజా నిర్ణయంతో ఏడాదికి రూ. 268.13 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ఇప్పటికే లెక్కలు వేసి తేల్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: