ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పాలి.  చెప్పిన చదువుకు ప్రభుత్వం వాళ్లకు జీతాలు ఇస్తుంది.  ఇంటికి వెళ్ళాక ఉపాధ్యాయులు ఎలా ఉంటారు అన్నది వాళ్ళ ఇష్టం.  కానీ, అలా కాకుండా, ఉపాధ్యాయులు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ.. స్కూల్ సమయంలో చదువు చెప్పకుండా నచ్చినట్టుగా స్కూల్స్ కు వాస్తు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం ప్రభుత్వం ఊరుకుంటుందా చెప్పండి.  చాలా ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాయి.  
ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.  ఇక టిక్ టాక్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఒక్క ఉపాధ్యాయులేంటి చాలామంది తమను తాము మర్చిపోతూ.. ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు.  ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు.  ఈ విధంగా ప్రవర్తించడం వలన వారు వారి విధులను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు.  అందులో కొన్ని ఇలానే ఉంటున్నాయి.  ఇటీవలే విధులు పక్కన పెట్టి టిక్ టాక్ చేస్తున్న వ్యక్తులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.  
పోలీసులు సైతం ఇలానే చేయడం వలన ప్రజల నుంచి, ప్రభుత్వాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.  ఇకపోతే, రాజస్థాన్ రాష్ట్రంలో ఓ అడుగు ముందుకు వేశారు.  ఏకంగా స్కూల్లో మహిళా టీచర్ అందరి ముందు నాగిని డ్యాన్స్ చేసింది.  ఆమె ఒక్కతే కాదు.. ఆమెకు తోడుగా మరో టీచర్ కూడా డ్యాన్స్ చేశారు.  చుట్టూ ఉన్న కొందరు వారిని ఉత్సాహ పరుస్తూ చప్పట్లు కొట్టారు.  దీంతో వాళ్ళు మరింత రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.  అక్కడితో ఆగితే సరిపోయేది.  
డ్యాన్స్ చేసి దానిని పబ్లిసిటి చేసుకోకుంటే ఎలా అనుకున్నారేమో.. తీసిన వీడియోను ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వైరల్ గా మారడంతో అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  ఈ వీడియో చూసిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది.  నాగిని డ్యాన్స్ చేసిన లేడీ టీచర్, మరో ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.  అదే విధంగా మరో ఇద్దరికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  ఈ సంఘటన జరగడానికి కారణాలు తెలుసుకోవాలని అధికారాలునకు ప్రభుత్వం ఆదేశించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: