రాజకీయ ఎత్తుగడ వేయడమే కాదు, దాన్ని  విజయవంతంగా ఎలా ముగించాలో తెలంగాణ   ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంతగా, మరెవరికి  తెలియదని మరోసారి రుజువయింది . అందుకే అయన విపక్షాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ, ప్రజల మన్నలను పొందుతున్నారు . చివరకు ఆర్టీసీ సమ్మె ముగింపు వ్యవహారంలోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినతీరు అందరి ప్రశంసలను చూరగొంటోంది . మూడు రోజుల క్రితం   ఆర్టీసీ కార్మికులు  సమ్మె  విరమించి విధుల్లో చేరుతామని చెప్పినా , చేర్చుకొని కేసీఆర్కేబినెట్ భేటీ అనంతరం ఎటువంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లో  చేర్చుకుంటానని ప్రకటించి యూనియన్ నేతలకు , విపక్షాలకు ఊహించని ఝలక్ ఇచ్చారు .

 

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన విధుల్లో చేర్చుకొమ్మని కోరిన చేర్చుకొని కేసీఆర్, పలు షరతులు విధించి వారిని విధుల్లోకి తీసుకుంటారని అందరూ ఊహించారు . అయితే కేసీఆర్ మాత్రం దానికి భిన్నంగా ఆర్టీసీ కార్మికులంతా తమ బిడ్డలేనని , వారిని ఎటువంటి షరతుల్లేకుండా చేర్చుకుంటామని ప్రకటించడం ద్వారా నిన్న , మొన్నటి వరకూ తమకు బద్ధ విరోధిగా భావించిన  కార్మికులను ప్రస్తుతం తనవైపు తిప్పుకోవడం లో అయన  సక్సెస్ అయ్యారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు  .  అక్టోబర్ ఐదవ తేదీ అర్ధరాత్రి  నుంచి  తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెల్సిందే .

 

 సమ్మె ప్రారంభించిన నాటి, సమ్మె చట్టబద్ధం కాదని , యూనియన్ నాయకులను కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతూ వచ్చిన కేసీఆర్ , మరోసారి అదే విషయాన్ని చెప్పుకొచ్చారు   . ఆర్టీసీ కార్మికులను   రోడ్డు ను బజారు పాలు చేసింది  యూనియన్ నేతలు , విపక్ష నాయకులేనని అయన మండిపడ్డారు . ఆర్టీసీ ని బ్రతికించుకొద్దామని చెప్పుకొచ్చారు .     

మరింత సమాచారం తెలుసుకోండి: