డాక్టర్ ప్రియాంక రెడ్డి.. నిన్నటి నుండి ట్రెండ్ అవుతున్న సంఘటన. గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. హత్యకు ముందు ఆమెని అత్యాచారం చేశారని పోలీసులు కూడా భావిస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే నిన్న సాయింత్రం ప్రియాంక రెడ్డి మృతుదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు మృతుదేహాన్ని అప్పగించారు. అయితే డాక్టర్‌ ప్రియాంక రెడ్డి నవాబుపేట మండలం కొల్లూరులో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి కూడా వైద్యుడే. అయితే ప్రియాంకా రెడ్డి స్వస్థలం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ దగ్గర నర్సాయపల్లి. 

 

మృతురాలి కుటుంబం ప్రస్తుతం శంషాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రియాంకారెడ్డి ఉదయం స్కూటీ మీద ఆఫీస్‌కు వెళ్ళింది. అనంతరం ఆరోగ్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా స్కూటీలో గాలి తక్కువ ఉందని కొందరు దుండగులు ఆమెను అపి గాలి కొట్టించుకు వస్తామని తీసుకెళ్లారు..  

 

ఆ సమయంలో సోదరికి ఫోన్‌ చేసి ఇక్కడ అందరూ లారీ వాళ్ళు ఉన్నారు నాకు భయంగా ఉందే.. కొంచంసేపు నాతో మాట్లాడు పాప అంటూ తన సోదరిని అడిగింది. అక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా అక్కడికి వేళ్ళు అని చెప్పిన ఆమె కొంచం అలోచించి అక్కడే ఉంది. అనంతరం కొద్దిసేపటికి ఫోన్ కట్ అయ్యింది. 

 

సోదరి వస్తుంది వస్తుంది అని ఎదురు చూసి తల్లిదండ్రులతో పాటు వెళ్లి పోలీసులకు అప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఉదయానికి సోదరి సజీవదహనం అయి కనిపించింది. అయితే ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారా ? అసలు ఎవరు చేశారు అని పోలీసులు అనుమానించగా.. 

 

ఆమె బండిలో గాలి అదేపనిగా తీసేసారు అని ఆ గాలి తీసేసి ఆమెను ప్లాన్ ప్రకారమే మధ్యలో అపి ఇద్దరు కలిసి ఆమెను కారులో కిడ్నప్ చేశారని.. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి హత్య చేశారని పోలీసులు చెప్తున్నారు. కాగా ఆ ప్రాంతంలో ఎక్కువగా లారీ డ్రైవర్లు తిరుగుతారు కాబట్టి వారే ఆమెను ఆలా చంపి ఉంటారు అని కుటుంబసభ్యులు అనిమానిస్తున్నారు. 

 

ప్రియాంకను అంత దారుణంగా సజీవ దహనం చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ప్రియాంక రెడ్డి స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూర్ రహదారి పక్కన గుర్తించారు. 

 

అయితే ప్రియాంక రెడ్డి స్కూటీ నెంబర్ ప్లేట్ తీసివేసినట్టు పోలీసులు గుర్తించారు.. అక్కడి వరుకు ఆమె వాహనాన్ని ఎవరు తీసుకెళ్లారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంకా రెడ్డి స్కూటీని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. మరి ఈ కేసులో ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో.. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

 

ఏది ఏమైనప్పటికి ఇప్పుడు ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయం వేస్తుంది. ప్రతి రోజు కనీసం అంటే కనీసం 30 అత్యాచార కేసులైన రాష్ట్రవ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. ఇన్ని అత్యాచారాలు.. ఇన్ని హత్యలు.. ఇన్ని సజీవదహనాలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదు.. అనుకుంటాము కానీ పోలీసులు, మీడియా వాళ్ళు కూడా అప్పటికి ట్రేండింగ్ టాపిక్ మాత్రమే తీసుకుంటారు.. మళ్ళి దీని కంటే ట్రేండింగ్ టాపిక్ వస్తే దాని దగ్గరకు వెళ్తారు.. ఆలా వెళ్లడం వారి స్వార్థం అయినా ఆలా వెళ్ళడానికి కారణం మాత్రం ప్రజలే అని చెప్పాలి. ఏమైతేనేం.. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటె కాస్త జాగ్రత్తగా చూసుకోండి. బయట చాలామంది నీచమైన కామాంధులు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: