రంగారెడ్డి జిల్లాలో స్కూటీ టైర్ పంక్చర్ చేయిస్తామని నమ్మించి ఆ తరువాత యువతి ప్రియాంక రెడ్డిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ప్రియాంక రెడ్డి చటాన్ పల్లి దగ్గర శవమై కనిపించింది. బుధవారం రోజున విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రియాంక రెడ్డి ముఖంపై ఏర్పడిన మచ్చల చికిత్స కోసం తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర స్కూటీని ఆపి గచ్చిబౌలిలోని క్లినిక్ కు వెళ్లి చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లటానికి టోల్ ప్లాజాకు రాగా స్కూటీ టైర్ పంక్చర్ అయినట్లు గుర్తించింది. 

20 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి ప్రియాంక వద్దని చెప్పినా వినకుండా స్కూటీ  బాగుచేసుకొస్తానని తీసుకెళ్లాడు. ఆ తరువాత కొంత సమయం పాటు ప్రియాంక తన చెల్లితో ఫోన్ లో మాట్లాడింది. ఆ తరువాత ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. చటాన్ పల్లి రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు బంగారు లాకెట్ ఆధారంగా ప్రియాంకను గుర్తు పట్టారు. పోలీసులు ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన తరువాత ప్రియాంక కిడ్నాప్ అయినట్లు భావిస్తున్నారు. 
 
ప్రియాంక కిడ్నాప్ అయిన ప్రాంతానికి, ప్రియాంక మృతదేహం ఉన్న ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రియాంక చెల్లి ప్రియాంకను టోల్ ప్లాజా దగ్గరే ఉండమని కోరింది. కానీ ప్రియాంక మాత్రం చెల్లి మాటను వినిపించుకోలేదు. ప్రియాంక్ బైక్ లో శంషీర్ అనే వ్యక్తి గాలి నింపాడు. బండిలో గాలి నింపిన శంషీర్ టీషర్ట్, జీన్స్ పాంట్ వేసుకున్న 20 సంవత్సరాల యువకుడు ఎర్ర రంగు స్కూటీతో వచ్చాడని బండి పంక్చర్ అయిందని చెప్పి బండిలో గాలి నింపించుకొని వెళ్లిపోయాడని పోలీసులకు చెప్పాడు. 
 
సత్యం అనే రైతు జాతీయ రహదారి బ్రిడ్జి కింద 6 గంటల సమయంలో మనిషి కాలిపోతున్న విషయాన్ని గుర్తించానని ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పాడు. పోలీసులు ఈ కేసులో అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ప్రియాంక స్కూటీ కొత్తూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: