ఎవరైతే కామంతో సలసల కాగిపోతుంటారో, ఎవడైతె న్యాయం, అన్యాయం అనే విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తాడో, వారి జీవితాలు ఊర్లోని రచ్చబండలా మారుతాయి. మనిషి మానసిక స్దితిని రోజు రోజుకు కోల్పోతున్నాడు అనడానికి ఇప్పుడు లోకంలో ముళ్లకంపలా గుచ్చుకుంటున్న హత్యాచారాలు చాలు, అక్రమ సంబందాలు చాలు ఉదహరించడానికి. మొగుడు ఇవ్వలేని సుఖం ప్రియుడు ఇస్తాడనే ఓ వెర్రి ఆలోచన, కట్టలు తెంచుకుంటున్న కామకోరికలు ఆడ, మగ అనే తెడాలేకుండా వాస్తవాన్ని గ్రహించే జ్ఞానానికి ముసుగేసి ముందుకు తోస్తుంది.

 

 

క్షణకాలం దక్కే సుఖం కోసం చూసుకుంటుంటే జీవితకాలం శిక్షలు ఎవరికి వారే వేసుకుంటున్నారు. ఇక ఈ మద్యకాలంలో ఆడ అనేపదం పడక సుఖానికే అంకితమవుతుంది. ఇక మగవానికి వేరే ఏం పనులు లేనట్లుగా తాను పుట్టిందే కామాన్ని అనుభవించడం కోసం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాగే ప్రవర్తించిన ఓ పెళ్లి అయిన ఆడది చివరికి బజారుపాలైంది. నెల్లూరు జిల్లాలోని వైయస్సార్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన  పూర్తి వివరాలు పరిశీలిస్తే..

 

 

సలీం కు పర్వీన్ తో వివాహమై 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్ల వివాహ బంధంలో ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక సలీం మెకానిక్ గా పనిచేయడం వల్ల పొద్దున వెళ్లితే రాత్రికి వచ్చేవాడు... పర్వీన్ మాత్రం ఇంట్లో ఉండి ఇల్లు, పిల్లలను చక్కబెట్టేది. ఇంటి పనులన్ని ముగుసాకా వాట్సాప్ ను ఎక్కువగా యూజ్ చేసేది పర్వీన్.. ఈ క్రమంలోనే షేక్ షుకూర్ అనే ఒక ఆటో డ్రైవర్... పర్వీన్ తో వాట్సాప్ లో టచ్ ఉన్న... ఒక మహిళ ద్వారా.. పర్వీన్ నెంబర్ తీసుకుని. ఈమెతో స్నేహాన్ని పెంచుకున్నాడు. అలా కొద్దిరోజుల తర్వాత పర్వీన్, షేక్ షుకూర్ మధ్య స్నేహం బలంగా ఏర్పడింది. చివరికి ఆ స్నేహం క్రమక్రమంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది.

 

 

ఇలా భర్త లేని సమయంలో పర్వీన్ తరచుగా షేక్ షుకూర్ ను కలసి శృంగారంలో పాల్గొనేది. కామ క్రీడలో ఉన్నప్పుడు సెల్ఫీ ఫోటోలను కూడా దిగారు. అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాక పర్వీన్ లో బాగా మార్పు వచ్చింది. ఇది గమనించిన పర్వీన్ భర్త సలీం... ఆమెపై అనుమానం పెంచుకున్నాడు....దాంతో ఆమె ఫోనులో ఉన్న వాట్సాప్ చాటింగులను పరిశీలించి చూడగా రంకు మొగుడితో తన భార్య అసభ్యరీతిలో ఉన్న పిక్ కనిపించింది. దాంతో షాకయిన సలీం వారిద్దరిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవాలని పధకం పన్నాడు.

 

 

ఇదేమి తెలియని ప్రియుడు షేక్ షుకూర్ పర్వీన్ ని కలసి రాసలీలలు కొనసాగిస్తుండగా  స్నేహితులు, కుటుంబ సభ్యులతో  సలీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని గుట్టును రట్టు చేశాడు. ఈ దశలో షేక్ షుకూర్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా లాభం లేకుండా పోయింది.. వివాహం అయ్యి ఇద్దరు పిల్లల్ని కన్నా కూడా... ఇలా పక్కదారి పట్టడంతో పర్వీన్, ఆమె ప్రియున్ని చితకబాది  పోలీసులకు అప్పగించారు. దీని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే కామాన్ని అణుచుకుంటే కాపురాలు మిగులుతాయి.లేదంటే జీవితాలు తెగిన గాలిపటాలవుతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: