ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో ప్రకటించిన దాని కన్నా అదనంగా నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, జత షూస్, సాక్సులు, 3 జతల యూనిఫారమ్స్ ఇవ్వనుంది. యూనిఫారమ్స్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే యూనిఫారమ్స్ కుట్టించుకునేందుకు డబ్బులను ఇవ్వనుంది. సీఎం జగన్ అధికారులకు వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, షూస్, సాక్సులు, 3 జతల యూనిఫారమ్స్ అందించాలని ఆదేశించారు. 
 
జగన్ అధికారులతో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ప్రణాళిక గురించి కూడా చర్చించారు. సీఎం జగన్ అధికారులకు వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టబోతున్నామని పిల్లలను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులను 1వ తరగతి నుండి 6వ తరగతి విద్యార్థులకు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. 
 
సీఎం జగన్ అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్నీ సజావుగా జరగాలని అధికారులకు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత మొదటి నెల రోజులు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. సీఎం జగన్ విద్యా ప్రమాణాలపై ఎక్కడా రాజీ పడొద్దని, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు కాలేజీల విషయంలో లొంగవద్దని, నా నుండి ఎలాంటి రికమెండేషన్లు ఉండవని, వేరే ఎవరు చెప్పినా లెక్క చేయవద్దని ఉన్నతవిద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: