రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్‌ పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సంపాదించారు పోలీసులు. లారీ డ్రైవర్లు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించగా ప్రియాంక రెడ్డి ప్రతిఘటించడంతో హత్య చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా శవాన్ని కాల్చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

అసలేం జరిగింది 

 

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన శ్రీధర్ రెడ్డి, విజయమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురు ప్రియాంక రెడ్డి కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తోంది. రెండో కూతురు భవ్య శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఉద్యోగి. వీరు శంషాబాద్ లో నివాసం ఉంటున్నారు. విధులు నిర్వర్తించడానికి, ప్రతిరోజూ శంషాబాద్ నుంచి కొల్లూరుకు ప్రియాంక రెడ్డి వెళ్లి వస్తూ వుంటారు. ఇక బుధవారం కూడా (నవంబర్ 27) విధులకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ముఖంపై మచ్చలు ఏర్పడుతున్నాయి అంటూ చికిత్స కోసం గచ్చిబౌలి వరకు వెళ్ళొస్తా అంటూ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ప్రియాంక ఇక ఆ తరువాత ఇంటికి రాలేదు. తరువాతి రోజు తెల్లవారుజామున ప్రియాంక రెడ్డి మృతదేహం కనుగొన్నారు పోలీసులు. ఆ రాత్రి ప్రియాంక రెడ్డి ని కొంతమంది లారీ డ్రైవర్లు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి."ఆ లారీ వాళ్లే నా కూతురును చంపేశారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి 

 

"చెల్లి మాట వింటే ప్రాణాలు దక్కేవి కదా, అయ్యో ఎంత పని చేశావమ్మా" ప్రియాంక తల్లితండ్రుల ఆవేదన

 

సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ప్రియాంక 9 గంటల ప్రాంతంలో చెల్లి భవ్య కు ఫోన్ చేసింది స్కూటీ పంక్చర్ అయింది. "ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర బండి పెట్టొద్దని చెప్పారు, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పెట్టాను, ఇక్కడ కొంత మంది లారీ వాళ్ళు ఉన్నారు, పంక్చర్ వేపిస్తామని స్కూటీ ని తీసుకువెళ్లారు, నాకు చాలా భయంగా ఉంది" అని చెల్లి కి చెప్పగా నువ్వు అక్కడ ఉండకు టోల్ ప్లాజా దగ్గరకు రా వాహనాలకు టిక్కెట్లు ఇచ్చే దగ్గర వుండు అని చెల్లి భవ్య చెప్పగా ప్రియాంక మాత్రం చెల్లి మాటను వినలేదు. ఒకవేళ భవ్య మాట విని టోల్ ప్లాజా వద్దకు వచ్చి ఉంటే అధిక జన సంచారం వుండే ఆ చోట నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడికట్టేవారు కాదని పోలీసులు సైతం అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: