వరంగల్‌లో నిన్న జరిగిన గాదం మానస(19)పై అత్యాచారం, హత్య  సంచలనం రేపింది. ఇక ఈ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే కేసు మిస్టరీ వీడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా  గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన  మానస హన్మకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో విగత జీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపగా నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి..

 

 

ఈ ఘాతుకానికి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలికొండ ప్రాంతానికి చెందిన పులి సాయిగౌడ్‌ అలియాస్‌ సాయికుమార్‌ పాల్పడినట్లు తేల్చారు. ఇకపోతే 6 నెలల పరిచయంలో ప్రేమ పేరిట నమ్మించి పథకం ప్రకారం  బయటకు రప్పించి మానసపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు తేలింది. కేసులో సాయికుమార్‌ను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించిన వరంగల్‌ పోలీసు కమిషనర్‌ విశ్వనాథ రవీందర్‌ ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు.

 

 

ఇక హన్మకొండ హంటర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న సాయిగౌడ్‌, హంటర్‌రోడ్డులోని నీలిమ జంక్షన్‌ వద్ద తండ్రితో కలసి కూరగాయల వ్యాపారం నడుపుకొంటూ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోన్న మానసతో 6 నెలల కింద పరిచయం ఏర్పడింది కొద్ది రోజులుగా ఇద్దరూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో తనను కలిసేందుకు రావాలని సాయి కోరగా, భద్రకాళి గుడికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి మధ్యాహ్నం ఇంటి నుంచి  వెళ్లిన మానసను. ముందుగా అదాలత్‌ జంక్షన్‌ వరకు రావాలని చెప్పిన సాయి..

 

 

ఆ తర్వాత కాజీపేట వైపు రావాల్సిందిగా సూచించాడు. కాజీపేట వెళ్లి ఎదురు చూస్తుండగా.. మానసను కారులో తీసుకెళ్లిన సాయి.. చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి. అక్కడ మానసను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు సీపీ తెలిపారు. తర్వాత నిందితుడు సాయి మానసది సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మానస మృతదేహాన్ని కారులో ఎక్కించి చీకటి పడే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ సెంటర్‌ మీదుగా, హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాడు.

 

 

మానస హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్‌ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి బయల్దేరి హంటర్‌ రోడ్డులోని న్యూ శాయంపేట రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకుని మానస ఒంటిపై రక్తసిక్తమైన దుస్తులను తీసి కొత్త డ్రెస్‌ వేశాడు. అక్కడి నుంచి విష్ణుప్రియ గార్డెన్స్‌ పరిసర ప్రాంతానికి చేరుకుని ఎవరికీ కనిపించకుండా నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి నమిలికొండకు వెళ్లిపోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మానసను సాయికుమారే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా సాక్ష్యాధారాలను సేకరించి నమిలిగొండలో అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: