52 రోజులపాటు సమ్మె చేసిన తరువాత కొన్ని నాటకీయ పరిణామాల తరువాత జరిగిన కేబినెట్ మీటింగ్ లో కెసిఆర్ చర్చించి మరలా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు.  డిమాండ్లు నెరవేరాలని కోరుతూ అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు.  దసరా, బతుకమ్మ సమయాలలో కార్మికులు సమ్మె చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  ఆర్టీసీకి లాస్ వచ్చింది.  ప్రజారవాణా తిరగకపోవడంతో ఆర్టీసీ కార్మికుల స్థానంలో ప్రభుత్వం తాత్కాలిక కార్మికులను తీసుకొని రవాణా కొనసాగించింది.  
అయితే, బస్సులు ఎలాంటి కండిషన్లో ఉన్నాయో తెలియక పోవడం, డ్రైవింగ్ కూడా సరిగా రాకపోవడంతో బస్సులు యాక్సిడెంట్స్ జరిగాయి.  వరసగా బస్సులు ప్రమాదాలు జరగడంతో ప్రభుత్వం సైతం షాక్ అయ్యింది.  కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అనుకున్నా.. వెంటనే తీసుకుంటే.. మరలా ఏదైనా తేడా వస్తే సమ్మె చేస్తారనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగం విలువ ఏంటో చెప్తూ తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.  
విధుల్లోకి తీసుకోవడంతో కార్మికుల కళ్ళలో తిరిగి ఆనందం వచ్చింది.  ఈరోజు నుంచి రాష్ట్రంలో బస్సులు రోడ్డెక్కబోతున్నాయి.  తక్షణ సహాయం కింద ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 100 కోట్లు మంజూరు చేసింది.  చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పింది.  ఇక, ఆర్టీసీ వాటా ఇందులో 30శాతం ఉందని లెక్కలు తీస్తే రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని, అదంతా ఇస్తారా అని అడిగారు.  
దీనిపై మాట్లాడేందుకు ఐదారు రోజుల్లో ప్రధాని మోడీని కలవబోతున్నట్టు ఆమె చెప్పారు.  మోడీని కలిసి మాట్లాడతానని అన్నారు.  అదే విధంగా ప్రతి డిపోలో ఇద్దరు సంక్షేమ అధికారులు ఉంటారని, ఆర్టీసీ నుంచి కార్మికులకు ఎలాంటి వేధింపులు రాకుండా చూసుకుంటారని అన్నారు.  అంతేకాదు, చెప్పినట్టు  వింటే సింగరేణి రహాలోనే బోనస్ లు కూడా ఇస్తామని కెసిఆర్ పేర్కొన్నారు.  కార్మికులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: