మ‌నిషికి చావు ఎప్పుడు వ‌స్తుందో ?  ఎలా వ‌స్తుందో ?  ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ప్ర‌తి దానికి మందును క‌నిపెడుతోన్న మ‌నిషి చావుకు మాత్రం ఎలాంటి మందును క‌నిపెట్ట‌డం లేదు. మ‌నిషి త‌న మేథ‌స్సుతో ప్ర‌పంచాన్ని ఎంతో మార్చాడు. ఈ రోజు స్మార్ట్ ఫోన్ల వ‌ల్ల ప్ర‌పంచం మ‌నిషి అర చేతుల్లోకి వ‌చ్చేసింది.. ప్ర‌పంచంలో ఏ మూల ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో ప్ర‌పంచం అంతా తెలిసిపోతోంది.

 

దీంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మ‌నిషి ఎంతో ముందుకు దూసుకు పోయాడు. అయినా మ‌నిషి చావుకు మాత్రం మందును క‌నుగొన‌లేదు. అయితే ఈ చావు ఎవ‌రికి అయినా ఎప్పుడు వ‌స్తుందో ?  ఏ రూపంలో వ‌స్తుందో ?  ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. మ‌నిషి పుట్టుక.. మ‌న‌షి చావు రెండు కూడా మ‌నుష్యుల చేతుల్లో లేవు. అది పాము కాటు రూపంలోనో... లేదా రోడ్డు ప్ర‌మాదంలోనో ... లేదా నీళ్ల ద్వారానో .. లేదా నిప్పు ద్వారానో.... లేదా క‌రెంట్ షాక్ ద్వారానో ఇలా చావును ఊహించ‌లేం.

 

అయితే ఒక్కో సారి మ‌నుష్యులు మ‌రి చిత్ర విచిత్ర‌మైన కార‌ణాల‌తో చ‌చ్చి పోతుంటారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. ఓ వ్య‌క్తిని కోడి గుడ్డు చంపేసింది. అదేంటి మ‌నిషిని కోడి గుడ్డు చంపేయ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ?  ఇది నిజ‌మే. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 

 

శ్రీరామ్ వైన్స్ పక్కన ఉన్న దాబాలో పనిచేస్తున్న వ్యక్తి గుడ్డు తింటున్న క్రమంలో అది గొంతుకు అడ్డం పడింది. దీంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న యాదయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే యాదయ్య(45) మృతి చెందాడు. లోప‌ల అత‌డి గొంతుక‌కు కోడి గుడ్డు అడ్డంగా ఉండ‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: