తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రతి కిలో మీటర్ కు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచేందుకు కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అన్ని బస్సులకు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించారు. డీజిల్ ధరల కారణంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి భారీ నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి ఛార్జీల పెంపు వలన 752 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఏపీ సీఎం జగన్ కు భారీగా లాభం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా ముందడుగు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వలన ఏపీ నుండి తెలంగాణలోని ప్రాంతాలకు, తెలంగాణ నుండి ఏపీలోని ప్రాంతాలకు తిరిగే తెలంగాణ రాష్ట్ర బస్సుల ఛార్జీలు భారీగా పెరగబోతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు తిరిగే ఏపీ బస్సుల ఛార్జీలు మాత్రం పెరగటం లేదు. 
 
అందువలన ప్రయాణికులు ఏపీకు చెందిన బస్సులలోనే ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఏపీకు చెందిన బస్సులలో ప్రయాణం చేస్తే ప్రయాణికులకు 30 రూపాయల నుండి వందల రూపాయల్లో ఆదా అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఛార్జీలు పెంచటంతో హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సును బట్టి 28 నుండి 54 రూపాయలు, హైదరాబాద్ నుండి బెంగళూరుకు 59 రూపాయల నుండి 111 రూపాయలు, హైదరాబాద్ నుండి విశాఖపట్నం కు 64 రూపాయల నుండి 125 రూపాయల వరకు ఛార్జీలు పెరగబోతున్నాయి. 
 
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వలన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు ప్రయాణించే తెలంగాణ రాష్ట్ర బస్సుల ఛార్జీలు పెరుగుతూ ఉండటం వలన తెలంగాణ రాష్ట్ర బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఏపీకి చెందిన బస్సులలో ఛార్జీలు పెరగకపోవటం వలన ప్రయాణికుల సంఖ్య పెరిగి ఏపీ ఆర్టీసీకి గతంతో పోలిస్తే లాభాలు పెరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న జగన్ కు భారీగా లాభం కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: