అమాయకులైన, ఎంతగా తెలివి మీరిన వారైనా మోసగాళ్ల చేతిలో మోసపోతూనే  ఉన్నారు. ఇందులో ఎక్కువగా చదువున్న వారే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపోతే అమెరికాలో మరో నకిలీ యూనివర్సిటీ పేరుతో జరుగుతున్న మోసం వెలుగుచూసింది.

 

 

దేశంలోనికి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా అధికారులు నకిలీ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి అందులో చేరిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారు. గతంలో 161 మంది అరెస్ట్‌ చేయగా.. తాజగా మరోసారి 90 మందిని అరెస్ట్‌ చేశారు. అయితే అమెరికా అధికారులు అదుపులోనికి తీసుకున్నస్టూడెంట్స్‌లలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని సమాచారం.

 

 

ఇక మిషిగాన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫార్మింగ్టన్‌ అనే నకిలీ వర్సిటీకి చెందిన 250 విద్యార్థులను అరెస్టు చేయగా. ఈ ఏడాది మార్చిలో అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ అధికారులు ఈ వర్సిటీకి చెందిన మరో 161 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చిలో మూతపడిన ఈ వర్సిటీలో మొత్తం 600 మంది విద్యార్థులు చేరి మోసపోయారు.  వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారని సమాచారం. ఇంత మంది భారతీయులే ఉండటం విచారకరం.

 

 

కాగా, అరెస్టయిన 250 మందిలో 80 శాతం మంది ఇప్పటికే అమెరికా విడిచి వెళ్లిపోయారని యూఎస్‌ఐసీఈ అధికారులు తెలిపారు. మరో 10 శాతం మందిని పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఫార్మింగ్టన్‌ వర్సిటీ ఫేక్‌ అని విద్యార్థులకు ముందుగానే తెలుసునని, అక్కడ ఎలాంటి క్లాసులు జరగడంలేదని అధికారులు వాదిస్తున్నారు.

 

 

ఇకపోతే  ఆ వర్సిటీలో విద్యార్థులను చేర్పించిన 8 మందిపై వీసా మోసం తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థుల పక్షాన పోరాడుతున్న టెక్సాస్‌ అటార్నీ రాహుల్‌ రెడ్డి మాట్లాడుతూ.. చట్టబద్ధంగా అమెరికా వలస రావాలనుకున్న వారు కూడా అనుకోకుండా కుట్రదారులకు చిక్కారని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: