చివరికి ఆర్టీసీ కార్మికులు జీవితానికి శుభం కార్డు పడింది. సమ్మె విరమించిన అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు జీవితాలపై స్పందించని తెలంగాణ సర్కార్. నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వరాల జల్లు కురిపించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. తమ 26 డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ జేఏసీ కార్మికులతో సమ్మె  మొదలుపెట్టగా ఒక డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే  52 రోజుల  పాటు సమ్మె చేసిన ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. దీంతో ఆర్టీసీ కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి . ఆర్టీసీ సమ్మె విరమించినప్పటి ప్రభుత్వ కార్మికుల  ఉద్యోగాలపై స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు అందరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

 

 

 

 ఈ క్రమంలో నిన్న క్యాబినెట్ తో  సమీక్ష సమావేశం  నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేర్చుకునే  అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె విరమించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులకు  అందరికీ వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . మరణించిన ఆర్టిసి కార్మికుల  కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వం లో గాని ఆర్టీసీ లో గాని వారి అర్హతకు తగిన ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల  మాటలు నమ్మి  పెడదారి పట్టారని  కెసిఆర్ వ్యాఖ్యానించారు. 

 

 

 

 అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడంతో ఆర్టీసీ మనుగడ ను గట్టెక్కించడానికి  టికెట్ చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ స్పష్టం చేసారు. ఈ పెంచిన చార్జీలు  డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాగా  టికెట్ చార్జీల పెంపు వల్ల ఆర్టీసీకి ఏడాదికి 750 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా  ఆర్టీసీ కార్మికులు అందరికీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అటు  రాష్ట్ర ప్రజలకు మాత్రం చేదు వార్త వినిపించారు. చార్జీల పెంపుతో ఆర్టీసీ మనుగడ బాగానే ఉన్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఏదిఏమైనా ఆర్టీసీ వివాదానికి  శుభం కార్డు పడడంతో ఆర్టీసీ కార్మికులు అందరూ సంబరాల్లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: