కెసిఆర్ ఎట్టకేలకు సమ్మె ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. 52 రోజుల తరువాత కార్మికులు తిరిగి ఈరోజు నుంచి విధుల్లోకి చేరుతున్నారు.  తిరిగి ప్రగతిరధ చక్రాలు పరుగులు తీయబోతున్నాయి.  అనవసరంగా కార్మికులు 52 రోజులపాటు సమ్మె చేసి తమ జీతాలను, 30 మంది కార్మికులు తమ జీవితాలను పోగొట్టుకున్నారు.  26 డిమాండ్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కోరుతూ సమ్మె చేస్తున్నారు.  కానీ, ఈ సమ్మె కాలంలో కనీసం ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు.  
డిమాండ్లు నెరవేరగకపోగా, సమ్మె చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో కార్మికులు షాక్ అయ్యారు.  అంతేకాదు, సమ్మెను మరింత ఉదృతం చేశారు.  కోర్టు కూడా చివరకు తమకు అధికారం లేదంటూ.. లేబర్ కోర్టులో చూసుకోవాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో పాటు ప్రైవేట్ పరం చేసేందుకు అనుమతులు ఇస్తూ తీర్పు ఇవ్వడంతో కార్మికులకు ఏం చేయాలో తోచలేదు.  వెంటనే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.  
సమ్మె విరమించిన డిపోల్లో వారిని తిరిగి తీసుకోలేదు.  ఆ తరువాత రెండు రోజులకు కెసిఆర్ కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.  అంతాబాగానే ఉన్నది.  రూ. 100 కోట్లు కూడా విడుదల చేశారు.  ఇదంతా బాగానే ఉన్నది.  అయితే, వారికీ మంచి చేయడం కూడా ప్రజలపై ఇప్పుడు కెసిఆర్ రూ. 792 కోట్ల రూపాయల భారం మోపాడు.  కిలోమీటరుకు 20 పైసలు చొప్పున టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  
ఈ  నిర్ణయంపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.  ఒకటి కాదు రెండు కాదు.. ప్రజలపై రూ. 792 కోట్లు భారం.  దీనికి ఎవరు బాధ్యత వహించాలి.  ఎలాంటి బాధ్యత వహించాలి.. కిలోమీటర్ కు 20 పైసల చొప్పున పెంచుతూ.. ప్రజలు అర్ధం చేసుకుంటారు అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి..  ప్రజలు ఎంతమేరకు దేనికి అంగీకరిస్తారు.. చూడాలి.  కిలోమీటరుకు 20 పైసలు భారం అంటే మాములు విషయం కాదు కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: