తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన ఆర్టీసి కార్మికుల సమ్మెపై కెసిఆర్ సానుకూలంగా సమ్మె చేసిన కార్మికులను ఈరోజు ఉదయం 6 గంటల నుంచి విధుల్లో చేరమని చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఆర్టీసి ని ప్రైవేట్ పరం చేయబోమని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆర్టీసి కి 100 కోట్ల తక్షణ ఆర్ధిక సాయం ప్రకటించి సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 

 

యూనియన్ల మాయలో పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని ఆయా కుటుంబాల్లో ఒక్కొక్క ఉద్యోగం కల్పిస్తాం అని  ప్రకటించి కార్మికుల హృదయాల్లో హీరో గా నిలిచిపోయారు. నిన్న కెసిఆర్ తన నిర్ణయం ప్రకటించిన తరువాత ఆర్టీసి కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పలు డిపోల వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్మికులు స్వీట్లు పంచుకుంటూ తమ సంతోషాన్ని తెలియచేసారు.

 

ఇక ఇదే సమయంలో తెలంగాణ లోని ప్రతిపక్షాలకు ఊహించని షాక్ తగిలింది. ఆర్టీసి పై కెసిఆర్ అనుసరించిన కఠిన వైఖరిని చూసిన ప్రతిపక్షాలు కార్మికులకు వ్యతిరేకంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు అని భావించారు, ఇక కెసిఆర్ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ఉంటే ఆర్టీసి కార్మికులకు చేరువ కావొచ్చు అని భావించారు. ఇక ఆర్టీసి కార్మికులకు కెసిఆర్ చేసిన ద్రోహానికి పోరాటం చేస్తూ రాబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస పార్టీని దెబ్బ తీయాలని తద్వారా తెలంగాణ పై మళ్ళీ పట్టు సాధించాలని అనుకున్నారు కానీ కెసిఆర్ ఊహించని విధంగా నిర్ణయం తీసుకుని ప్రతిపక్షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.  కెసిఆర్ వ్యూహానికి చిత్తయిన ప్రతిపక్షాలు కిం కర్తవ్యం అంటూ తలలు పట్టుకున్నారు. 

 

ఇక ఆర్టీసి కిలోమీటర్ కు 20 పైసలు చార్జీ పెంచుకోవచ్చని కెసిఆర్ ప్రకటించారు. దీనితో సామాన్య ప్రజలపై బస్సు భారం పడనుంది. కనీసం ఈ విషయంపై పోరాడి అయినా ప్రతిపక్షాలు పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: