నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అనే నానుడి  ఒకటుంది. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు ఏమేమి చేయించారో  ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్ధితులే ఎదురవుతున్నాయి.  చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత బిజెపికి బద్ధ శతృవులాగ వ్యవహరించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

బిజెపితో సంబంధాలు కటీఫ్ అయిపోయిన తర్వాత కేంద్ర హోంమంత్రి హోదాలో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో హఠాత్తుగా అమిత్ షా కాన్వాయ్ ను కొందరు అడ్డుకున్నారు. అమిత్ ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, రాళ్ళు వేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

 

దొరికిన వీడియోలు, ఫోటోల ఆధారంగా చూస్తే ఆందోళనకారులంతా తెలుగుదేశంపార్టీ శ్రేణులే అని బయటపడింది. మరపుడు చంద్రబాబుకు తెలీకుండానే అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిందా ? అలాగే నరేంద్రమోడి రాష్ట్రానికి వచ్చినపుడు నల్లజెండాలతో నిరసన చెప్పించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటనల్లో టిడిపి వాళ్ళే చెప్పులు, రాళ్ళు వేశారు. బిజెపి జెండాలను తగులపెట్టించారు. అవన్నీ చంద్రబాబుకు తెలిసే జరిగాయి.

 

అలాగే రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చిన సామాజిక ఉధ్యమకారులు మేధా పఠ్కర్, రాజేంద్రసింగ్ లాంటి వాళ్ళను అసలు అమరావతి ప్రాంతంలోనే అడుగుపెట్టనీయలేదు చంద్రబాబు. అధికారంలో ఉన్నపుడు ఏవి చేయకూడదో అవన్నీ చేశారు. ఎందుకంటే ఓ పదిహేనేళ్ళ పాటు తాను అధికారంలో ఉంటానని అనుకున్నారు. కానీ కర్మ కొద్ది ఐదేళ్ళకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది.

 

అందుకనే అధికారంలో ఉన్నపుడు  చేయించిన పనులే ఇపుడు ఎదురవుతున్నాయి. చంద్రబాబు పాలనతో రాజధాని ప్రాంతంలో  కడుపుమండిపోయిన జనాలు చెప్పులు, రాళ్ళతో స్వాగతం పలికారు. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న నానుడి ఊరికే రాలేదు. ఏం చేస్తాం ఇంకా నాలుగున్నరేళ్ళలో ఇంకెన్ని ఎదుర్కోవాలో ఏమో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: