తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే సమ్మె చేయడం కార్మికులు మొదలు పెట్టారో అప్పటి నుండే తెలంగాణ రాష్ట్రప్రజలకు మూడింది అని అనుకుంటూనే ఉన్నాం. అలా అనుకున్నట్లుగానే ఇప్పుడు తెలంగాణ ప్రజల నెత్తిన పెద్ద పిడుగు పడింది. అదే బస్సు చార్జీల పెంపు. అసలు ఎవరికోసం సమ్మె చేశారు?. ఎందుకు ఇంతమంది కార్మికుల ప్రాణాలు తీశారు?. కోరిక నెరవేరకుండానే ఉన్న ఉద్యోగానికి ఎసరు పెట్టుకుని ఇప్పుడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కోలుకోని వాతలు పెట్టారు?. చివరికి వారు బాగుపడలే మధ్యలో ప్రజలు సుఖపడలే ఇప్పుడు సామాన్యులపై అనవసర ఖర్చుల భారం పడింది. చెడపకురా చెడేవు అనే సామేత ఇప్పుడు నిజం అయ్యింది.

 

 

ఇక బస్సు చార్జీల పెంపును ప్రజలు అర్ధం చేసుకొమ్మని చెప్పిన తెలంగాణ మంత్రి బస్సు చార్జీలు పెరిగాయనే నెపంతో పెరిగే నిత్యావసర ధరలను పెరగకుండా ఆపగలుగుతారా? నాయకుల జీత భత్యాలు తగ్గించుకుంటారా? అని మతిస్దిమితం ఉన్న సామాన్యూడు ప్రశ్నిస్తున్నాడు? ఒక రకంగా ఇప్పుడు పెంచిన ధరలు మద్యతరగతి జీవితాలపై చూపించే ప్రభావం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే చాలీ చాలనీ జీతంతో కుటుంబాన్ని నెట్టుకోస్తున్న మనిషి పెరగని జీతాలతో పెరుగుతున్న ధరలతో తన జీవితాన్ని మొత్తం పన్నులు, కట్టి ప్రభుత్వం చేస్తున్న అప్పులు కట్టడానికే వెచ్చిస్తున్నాడు? ఇదేనా నవసమాజ నిర్మాణంలో ఉన్న గొప్పదనం. ఇలాగైతే దేశంలో ప్రతివారు దొంగతనాలు  దోపిడీలు చేయకుండా అవసరాలను తీర్చలేని ఉద్యోగాలు ఎక్కడ చేసుకుని బ్రతుకుతారు?

 

 

వ్యవస్దలోని మలినాలను కడగాలంటే ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఒకటే మార్గం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే పెరిగిన ధరలను ఒక సారి చూసుకుంటే కిలో మీటర్‌కు 20 పైసలు పెంచుతున్నామని, వచ్చే నెల 2 వ తేదీ నుండి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఈ పెరిగిన ధరల వలన ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు రూ.750 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతానికి అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్తే అదనపు చార్జీలు వర్తిస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 

 

ఇక రాష్ట్రంలో పెరిగిన కొన్ని చార్జీల వివరాలు.. హైదరాబాద్విజయవాడ సుమారు రూ.53.. హైదరాబాద్ – విశాఖపట్నం సుమారు రూ.125.. హైదరాబాద్ – ఒంగోలు సుమారు రూ.65.. హైదరాబాద్వరంగల్ సుమారు రూ.30.. హైదరాబాద్కరీంనగర్ సుమారు రూ.32.. హైదరాబాద్ – నిజామాబాద్ సుమారు రూ.35.. హైదరాబాద్ఆదిలాబాద్ సుమారు రూ.60.. హైదరాబాద్ – ఖమ్మం సుమారు రూ.40 లుగా నిర్ణయించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: