తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చెయ్యడం వల్ల వాళ్లకు ఎం లాభం వచ్చిందో తెలియదు కానీ.. నిన్న సీఎం కేసీఆర్ చెప్పిన వార్తతో ఆర్టీసీ కార్మికులు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. 52 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కానీ ప్రయోజనం ఏమి లేదు... ఈ సమ్మెకు ఫలితంగా సామాన్యులకు చుక్కలు కనిపించేలా చార్జీలు పెంచారు. 

 

ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది ఎం పడలేదు.. ఇటు ప్రభుత్వం ఎం లేదు.. కేవలం మధ్యలో ప్రజలే వెర్రోళ్ళు అయ్యారు. అప్పుడు బస్సులు లేక.. వచ్చిన ప్రైవేట్ బస్సులు ఛార్జీలు పెరిగి ఇలా చాల ఇబ్బందులు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఈ ఆర్టీసీ కార్మికులు సమ్మె చెయ్యడం వల్ల ఎంతో అమాయకులు ప్రాణాలు విడిచారు. 

 

కారణం తాత్కాలిక డ్రైవర్లు.. కొందరు తాగి బస్సు నడిపితే మరికొందరు సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతారు. మరి కొందరు హై స్పీడ్ గా నడుపుతారు. ఇలా తాత్కాలిక డ్రైవర్ల కారణంగా కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు చేసి వస్తుండగా ఈ ప్రమాదాలు జరిగి ఆ కుంటుంబాలు అనాథలుగా మరి రోడ్డున పడ్డాయి. ఇంకా కొంతమంది ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చెయ్యడం వల్ల సర్కార్ మళ్ళి ఉద్యోగంలో చేర్చుకుంటారో లేదో అనే సందేహంతో కొందరు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు మానసిక భాదతో గుండె నొప్పితో మృతి చెందారు. 

 

కానీ చివరికి ఆర్టీసీ కార్మికులు అంత ఉద్యోగాల్లో చేరారు.. కథ సుకాంతం అయ్యింది. కానీ ప్రజలు మాత్రం ఈ రెండు నెలలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాక్సిడెంట్లను చూశారు. మరి ఇప్పుడు అవి అన్ని కాదు అని సర్కార్ ఛార్జీలు భారీగా పెంచేశాడు. మరో వైపు ఆర్టీసీ సమ్మె నాయకుడు అశ్వథామ రెడ్డి కనిపించడం లేదు.. ఏమైతేనేం.. ఎక్కడ ఏం జరిగిన సామాన్య ప్రజలకే అన్ని కష్టాలు వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: