’ఆంధ్రులకు ఒక రాజధాని ఉండాలని అనుకోవటం నా తప్పా’ ?

’రాజధాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరాలని అనుకోవటం నేను చేసిన నేరమా’ ?

 

’అమరావతి విషయంలో నేను చేసింది తప్పో ఒప్పో ప్రజలే ఆలోచించుకోవాలి’..ఇది తాజాగా అమరావతి ప్రాంతంలో పర్యటన తర్వాత  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. నిజానికి రాష్ట్రానికి  రాజధాని అవసరం లేదని ఎవరు అనుకోలేదు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబునాయుడు చేసిన మోసాలు, డ్రామాలే జనాలకు నచ్చలేదు. అమరావతి నిర్మాణం ముసుగులో చంద్రబాబు అండ్ కో చేసిన దోపిడినే జనాలు అంగీకరించలేదు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి వచ్చిన 23 సీట్లు.

 

రాజధాని నిర్మాణం విషయం తాను పడిన తపన, కష్టం లాంటి వాటిగురించి చంద్రబాబు ఎంత చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో స్వయంగా పుత్రరత్నం నారా లోకేష్ ఓడిపోవటమే  ఇందుకు సాక్ష్యం. అమరావతి నిర్మాణం ముసుగులో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది వాస్తవం. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది వాస్తవం.

 

తన మద్దతుదారులు, పార్టీలోని కీలక నేతలు, కావాల్సిన పారిశ్రామికవేత్తలు అందరూ పెద్ద ఎత్తున భూములు కొనేసిన తర్వాత రాజధానిని అమరావతిగా ప్రకటించారు. రాజధాని నిర్మాణం అంటున్న చంద్రబాబు చేసింది కేవలం తాత్కాలిక నాసిరకం నిర్మాణాలు మాత్రమే.  వందో రెండువందల కోట్లలోనో  అయిపోయే శాస్వత నిర్మాణాల శాస్వత స్ధానంలో వేల కోట్ల రూపాయలతో తాత్కాలిక నాసిరకం నిర్మాణాలు ఎందుకు చేసినట్లు ?

 

చంద్రబాబు ఇపుడు ఎన్ని నాటకాలు ఆడినా ఎంత అమాయకత్వాన్ని ప్రదర్శించినా జనాలు ఎవరూ పట్టించుకోవటం లేదు. రాజధాని నిర్మాణానికి 29 వేలమంది రైతులు భూములిస్తే సిఆర్డీఏ పట్టాలిచ్చింది 8 వేల మందికి మాత్రమంటేనే చంద్రబాబు రైతులను ఎంత మోసం చేశారో అర్ధమవుతోంది.  అధికారంలో ఉన్నంత కాలం డ్రామాలతో సరిపెట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవే డ్రామాలు కంటిన్యు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: