https://twitter.com/i/status/1199284960881975297

పాత్రికేయుల‌కు వృత్తిలో ఎదుర‌య్యే అనేకానేక ఇబ్బందుల్లో ఇదొక‌టి. ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ కవరేజ్‌లు కీల‌క‌మైన‌వి. ఎక్కడైనా ముఖ్య‌మైన‌ సంఘటన చోటు చేసుకుంటే అప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఆ వార్తను కవరేజ్ చేయడానికి లైవ్ పైనే ఆధార‌ప‌డుతుంటారు. అలా లైవ్ ఇచ్చేందుకు వెళ్లిన‌ ఓ రిపోర్టర్‌కు తాజాగా వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఓ రిపోర్టర్ కు వింత అనుభవం ఎదురైంది. గ్రీస్‌కు చెందిన‌ ఏఎస్టీ 1 టీవీ రిపోర్టర్ లాజోస్ మాంటికోస్ కైనెటా నగరానికి వరదలపై లైవ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు వెళ్లగా...ఆయ‌న‌కు ఓ పంది చుక్క‌లు చూపించింది.

 

గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో ఇటీవల సంభవించిన భారీ తుపానుకు ఆ ప్రాంతం అత‌లాకుతలం అయింది. ఇలాగే కైనెటా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ నేప‌థ్యంలో  ఏఎస్టీ 1 టీవీ రిపోర్టర్ లాజోస్ మాంటికోస్ ఆఫీసు నుంచి కీల‌క ఆదేశం వ‌చ్చింది. తుఫాను బారిన పడి అక్కడ ప్రజాజీవనం ఎంత మేర అస్తవ్యస్తమైందో, తుఫాను తరువాత వారు ఏ విధంగా జీవిస్తున్నారో అన్న విషయాన్ని రిపోర్టింగ్ చేయాల‌నేది ఆ ఆర్డ‌ర్ సారాంశం. దీంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లాడు లాజోస్‌. అయితే, స్టూడియోలో న్యూస్ యాంకర్ అప్ డేట్స్ ఇవ్వాలని మాంటికోస్‌ను అడిగారు. మాంటికోసం రిపోర్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా అతనివైపు ఓ పంది వచ్చింది. ఆ పంది మాంటికోస్ ను ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టింది. లైవ్ లో కనిపిస్తుండగటంతో స్టూడియోలో ఉన్నవారు నవ్వుల్లో మునిగిపోయారు.

 

దీంతో పందితోనే లాజోస్ లైవ్ ఇచ్చాడు. స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్‌ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కొరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. అంతేకాకుండా....చేసేదేమి లేక పంది కారణంగా తన రిపోర్టింగ్ మధ్యలోనే ఆపేస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొంద‌రు ఈ వీడియోను చూసి న‌వ్వుకుంటుంటే...మ‌రికొంద‌రు పాత్రికేయుల‌కు ఎదుర‌య్యే క‌ష్టాల‌కు ఇదో నిద‌ర్శ‌నం అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: