ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదు అంటారు.  ఉల్లిపాయ లేనిదే ముద్ద ముట్టని వ్యక్తులు ఎందరో ఉన్నారు.  ఉల్లిపాయ ధరలు ఆకాశంలో ఉన్నప్పటికీ కనీసం పావుకేజీ ఉల్లిపాయలైన సరే కొనుగోలు చేసి వంట చేయనిదే భారతీయులకు ముద్దదిగదు.  ఎంత ఎంత ధర ఉన్నా సరే కొనుగోలు చేస్తుంటారు.  ప్రస్తుతం దేశంలో ఉల్లిపాయ ధరలు కేజీ వందకు చేరుకుంది.  ఈ స్థాయిలో ధరలు మండిపోతుంటే.. ఆ గ్రామంలోని ప్రజలు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు.  వారికసలు ఉల్లి ధరల గురించి కానీ, ఉల్లిపాయల గురించి కానీ తెలియదట.  
ఆ గ్రామంలో ఎవరూ కూడా ఉల్లిని అసలు ముట్టుకోరట.  అదేంటి అని షాక్ అవ్వకండి.  ఈ ఆచారం ఇప్పటి నుంచి వస్తున్నది కాదు.. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నది.  వారి పూర్వీకుల కాలం నుంచి అక్కడ ఉల్లి ముట్టుకోరట.  ఒక కుటుంబమే రెండు కుంటుంబాలో ఉల్లి తినరు అనుకుంటే సరే అనుకోవచ్చు.. ఆ గ్రామంలో ఉన్న 30 కుటుంబాలు, 350 మంది ప్రజలు ఎవరూ కూడా దానిని ముట్టుకోరు.  
ఇంతకీ ఇంట విచిత్రమైన గ్రామం ఎక్కడుంది అనే కదా మీ డౌట్.. అకెక్కడికే వస్తున్నది.. అది మన దేశంలోనే ఉన్నది.  బీహార్ రాష్ట్రంలోని రాజధాని పాట్నాకు 80 కిలోమీటర్ల దూరంలో త్రిలోకి భిఘా అనే గ్రామం ఉన్నది.  ఆ గ్రామంలో జనాభా 350 మంది.  30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.  అయితే, ఈ 30 కుటుంబాల్లో ఒక్కరు కూడా ఉల్లిపాయ జోలికి వెళ్లారట.  దీంతో దేశంలో ఉల్లి రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్నీ వీరు పట్టించుకోరు.  ఉల్లితో తమకు సంబంధం లేదని అంటున్నారు.  
గతంలో ఈ గ్రామంలో కొందరు ఉల్లిని తిని మరణించారట.  ఇలాంటి సంఘటనలు రెండు మూడు జరగడంతో ఉల్లికి ఆ ఊరికి శాపం ఉందని ఉందని చెప్పి ఉల్లిని తినడం మానేశారు.  పూర్వీకుల నుంచి ఇదే ఆచారం కొనసాగుతున్నది.  ఎవరూ కూడా ఉల్లి తినడం లేదని అంటున్నారు.  ఈ గ్రామంలో విష్ణు ఆలయం ఉందని, అందుకే గ్రామంలో ఉల్లిపాయలను తినడం మానేశామని అంటున్నారు ప్రజలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: