తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్ల పొట్టుపల్లి గ్రామంలో పరాయి మహిళతో చనువుగా ఉండటం మంచి పద్ధతి కాదని చెప్పినందుకు రమేశ్ అనే వ్యక్తి కక్ష కట్టి పథకం ప్రకారం చెప్పిన వ్యక్తిని హత్య చేశాడు. కేతావత్ రమేశ్ అనే వ్యక్తి తరచుగా ఒక మహిళ ఇంటికి భర్త లేని సమయంలో వెళుతూ ఆ మహిళతో చనువుగా ఉండేవాడు. 
 
నవీన్ కుమార్ అనే వ్యక్తి గమనించి పద్ధతి మార్చుకోవాలని, భర్త లేని సమయంలో మహిళ ఇంటికి వెళ్లడం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చాడు. కానీ రమేశ్ మాత్రం తన తీరును మార్చుకోలేదు. ఈ క్రమంలో రమేశ్, నవీన్ మధ్య గొడవ జరిగింది. తీరు మార్చుకోకపోతే చంపేస్తానని నవీన్ రమేశ్ ను బెదిరించాడు. రమేశ్ నేనే నవీన్ ను చంపితే నవీన్ అడ్డు తొలగిపోతుందని భావించాడు. 
 
నవీన్ తన పొలంలో పని చేసుకుంటూ ఉన్న సమయంలో రమేశ్ నవీన్ ను వెనుకనుండి కర్రతో బలంగా కొట్టాడు. మరో మైనర్ బాలుని సహాయంతో నవీన్ తలపై రాయితో గట్టిగా మోదాడు. నవీన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత రమేశ్, మైనర్ బాలుడు నవీన్ మృతదేహాన్ని చెరువు దగ్గర గోతి తీసి పాతిపెట్టారు. నవీన్ ఇంటికి రాకపోవటంతో నవీన్ భార్య తన భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
నవీన్ భార్య రమేశ్ పై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. పోలీసులు రమేశ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు రమేశ్ అంగీకరించాడు. పోలీసులు రమేశ్ తో పాటు మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడు రమేశ్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. సీఐ శివకుమార్ ప్రభుత్వం తరపున కేసును ఛేదించిన పోలీసులకు రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: