రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన వెట‌ర్నరీ డాక్ట‌ర్ ప్రియాంకారెడ్డి హ‌త్యాచారం కేసును హైద‌రాబాద్ పోలీసులు చేధించారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అద‌పులోకి తీసుకుని విచారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ న‌లుగురిని కూడా శుక్ర‌వారం సాయంత్రం మీడియి ఎదుట ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అదృశ్యమై షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద శవమై కనిపించిన విష‌యం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది.   నలుగురు లారీ డ్రైవర్, క్లీనర్లు కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా  పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక రెడ్డితో టైర్ పంక్చర్ అయిన‌ట్లు నాట‌క‌మాడిన‌ట్లు తెలుస్తోంది.

 

సాయం చేస్తామ‌ని చెప్పి న‌లుగురు ఆమెను బ‌ల‌వంతంగా పొద‌ల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారం అనంత‌రం ప్రాణాల‌తో వ‌దిలేస్తే అంద‌రికి ప్ర‌మాద‌మేన‌ని భావించిన ఆ న‌లుగురు క‌లిసి ఆమెను గొంతు నులిమి ఊపిరాడ‌కుండా చేసి చంపేశార‌ట‌. ఈ విష‌యం ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వెల్ల‌డైంది. హత్యానంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆపై మృతదేహాన్ని అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పడేశారు. మరో నిందితుడు స్కూటీని కూడా అక్కడికే తీసుకొచ్చి పార్క్ చేశాడు.అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.

 

సెల్‌ట‌వ‌ర్ సిగ్న‌ల్స్ ఆధారంగా న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమ‌దైన ప‌ద్ధ‌తిలో విచారించ‌డంతో మొత్తం విష‌యం క‌క్కేశార‌ట‌.  ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిందితులను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వివరాలు వెల్లడించే అవకాశం ఉంద‌ని పోలీసు వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రియాంకారెడ్డి స్వ‌స్థ‌లం  నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి.  తండ్రి  శ్రీధర్‌రెడ్డి పీఏసీఎస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.  ప్రియాంకారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: