మిస్టరీగా మారిన ప్రియాంక రెడ్డి హత్య లో తెలంగాణ పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. నిందితులు మహబూబాబాద్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్లు గా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

 

పోస్టుమార్టం నివేదికలో ఏముంది 

 

ప్రియాంక రెడ్డి పోస్టుమార్టం నివేదిక హత్య జరిగిన తీరును కళ్ళకు కట్టినట్లు చూపింది. నిందితులు ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ చేసి తరువాత ఊపిరి ఆడకుండా చేసి సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో ఉంది. నిందితులు పక్కా ప్రణాళిక తో ప్రియాంక రెడ్డి స్కూటీ ని పంక్చర్ చేసి డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. 

 

ప్రియాంక స్కూటీ ని పంక్చర్ చేసి నలుగురు నిందితులు ఆమె స్కూటీ కి పంక్చర్ వేయిస్తామని చెప్పి ఒక 20 ఏళ్ళ వ్యక్తికి స్కూటీ ఇచ్చి పంపారు ప్లాన్ ప్రకారం a వ్యక్తి దగ్గరలోని షాప్ కి వెళ్లి కేవలం టైర్ లో గాలి నింపుకుని వచ్చి షాప్ క్లోజ్ చేసి ఉందని ప్రియాంకకు చెప్పగా, అక్కడి నుండి వెళ్తా అన్న ప్రియాంకను కిడ్నప్ చేసి సర్వీస్ రోడ్డు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అతి దారుణంగా నిందితులు ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ అనంతరం ఊపిరి ఆడకుండా చేసి ప్రియాంక రెడ్డి ని హత్య చేసి శవాన్ని ఇద్దరు వ్యక్తులు 28 కిమీ దూరం వరకు తీసుకు వెళ్లి తగులబెట్టారు. స్కూటీ నెంబర్ ప్లేట్ ను కొత్తూరు దగ్గర పడవేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు. 

 

సాంకేతిక సహాయంతో పోలీసులు హత్య కేసు ను ఛేదించారు. ప్రియాంక రెడ్డి హత్య పై స్పందించిన మంత్రి కేటీయార్ "అత్యంత క్రూరంగా హత్యకు పాల్పడిన మానవ మృగాలను తెలంగాణ పోలీసులు తొందరగా పెట్టుకుంటారని ఆశిస్తున్నా" అని ట్వీట్స్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: