లోకంలో ఆడపిల్లగా, అందంగా అసలే పుట్టకూడదనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న దారుణాలను చూస్తుంటే. ఇక నేటి మహిళ. రాకెట్ స్పీడుతో రోదసికేసి దూసుకుపోతోందని, ఆర్దిక, సామాజిక, రాజకీయ అది ఇది అనే తేడా లేకుండా అన్ని రంగాలలో ముందుకు వెళ్తోందని ఓ వైపు గర్వంగా చెప్పుకుంటున్నాం.. అదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు చూస్తే. బతికి ఉండగానే ఆమెను కాల్చి బుగ్గి చేసేస్తున్నాం.

 

 

అమ్మ కడుపులో నవమాసాలు నిండి ఈ లోకం లోకి అడుగుపెట్టకుండానే అమానుషంగా చిదిమేస్తున్నాం. పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న మనలో ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపే . ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. పుట్టేహక్కును కోల్పోతోంది. పుట్టినా జీవించే హక్కును కోల్పోతోంది. అందుకు కారణం ఎవరు? మనం ఎవరిని నిందించాలి? ప్రజలనా? పాలకులనా? మన విశ్వాసాలనా? మత నమ్మకాలనా? అమలు కాని చట్టాలనా? వీరి పట్ల ఇంతగా వివక్షత కనబరిచే సమాజాన్నా.

 

 

పిల్లల్ని కనడానికి, పక్కలో పడుకోవడానికి ఆడది కావాలి, ఇన్ని అందిస్తున్న ఆమెకు సమాజంలో విలువ తగ్గిపోతుంది. అన్న విషయాన్ని ఒక్క సారి ఆత్మ విమర్శచేసుకోవాలి. ఇకపోతే హైదరాబాద్ శివారు షాద్‌నగర్ సమీపంలో యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య, అత్యాచారం ఘటన కలకలంరేపింది. ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. స్కూటీ పంక్చర్ కావడంతో ఆమెకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్లు ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు..

 

 

సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇక ప్రియాంకా రెడ్డి ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని.. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ జంతువుల్ని తెలంగాణ పోలీసులు కచ్చితంగా పట్టుకుంటారని.. త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

ఈ కేసును తానే పర్సనల్‌గా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయాలని ఈ సందర్భంగా కోరారు కేటీఆర్. ఇదే కాకుండా ఈ ఘటనపై ఇటు మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి సమాజంలో మహిళలు భద్రత కోసం మరింత ఫోకస్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: