ఎన్నో  హెచ్చరికలు ఎన్నో నిరసనలు ఇంకా ఎన్నో డెడ్ లైన్  తర్వాత చివరికి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. 55 రోజుల తర్వాత విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు తమను  విధుల్లోకి తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకున్న కేసీఆర్ కు  ధన్యవాదాలు అంటూ పాలాభిషేకాలు సైతం చేస్తూన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్తో పాటు  న్యాయపరమైన 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె సైరన్ మోగింది ఆర్టీసీ జేఏసీ . ఆర్టీసీ జేఏసీ నేతల మీద నమ్మకంతో 47 రోజుల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేస్తే ఆ తర్వాత నట్టేట ముంచి సమ్మె విరమించింది ఆర్టీసీ జేఏసీ. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విధుల్లో  చేరమని ఎన్ని సార్లు హెచ్చరించిన  వాటిని  బేఖాతర్ చేసిన ఆర్టీసీ కార్మికులు... ఆ తర్వాత  సమ్మె విరమించిన  కేసీఆర్ పట్టించుకోకపోవడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా ఉడతాయా  అని ఆవేదన చెందారు కార్మికులు. 

 

 

 

 అయితే గతంలో ఆర్టీసీలోని 5,100 రూట్లను  ప్రైవేటీకరణ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఆర్టీసీ కార్మికులను నేటి ఉదయం నుంచి విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాకుండా సమ్మె చేస్తున్న సమయంలో మరణించిన ఆర్టీసీ కార్మికులందరీ  కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ఆర్టీసీలో తమ అర్హతకు తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు అందరూ కేసీఆర్ కు  ధన్యవాదాలు చెప్తూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే  టీఆర్ఎస్ నేతపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో హయత్ నగర్ డిపో దగ్గర చోటు చేసుకుంది. హయత్ నగర్ డిపో దగ్గర టీఆర్ఎస్ కార్పొరేటర్ తిరుమల రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 

 

 

 

 ఆర్టీసీ కార్మికులు అందరికీ కేసీఆర్ విధుల్లో చేరేందుకు అనుమతించడంతో.. విధుల్లో కి హాజరయ్యేందుకు వెళ్లగా... ఈ క్రమంలోనే వారితో మాట్లాడేందుకు కార్పొరేటర్ తిరుమలరెడ్డి డిపోకు వచ్చారు. అయితే విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు కార్పోరేటర్ తిరుమల్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేసి వెనక్కి పంపేశారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు అంటూ ఆయనను  నిలదీశారు ఆర్టీసీ కార్మికులు. ఇప్పుడు విధుల్లో చేరుతున్న మాతో  ఫోటో దిగడానికి వచ్చావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్పొరేటర్ తిరుమలరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: