తెలుగుదేశం పార్టీకి  అధికార వైసీపీ పెద్ద  షాక్  ఇచ్చింది . టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పార్టీకి అనుకూలంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున భూములు అప్పచెప్పింది ,ఈ విషయం అంత వైసీపీ ప్రభుత్వ విచారణ లో బయటపడింది . దీంతో వాటిపై జగన్ సర్కారు తాజాగా కొరఢా ఝలిపించడానికిసిద్ధం పడింది .

 

రాష్ట్ర రాజధాని  అమరావతి పరిధిలో గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం చంద్రబాబు  అక్రమంగా కేటాయించారని.  దానిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యతీసుకోవాలని ఎంతో విలువైన ఈ భూమిని టీడీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా  నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ ధరకు టీడీపీకి అమ్మేసిందని .. వెంటనే భూ కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ  వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు రాసిన లేఖలో  వెల్లడించారు 

 

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు 2017 జూన్ 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజుకు కేవలం ఏటా ఎకరానికి రూ.1000 కే కేటాయించడం వివాదాస్పదమైంది. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు చేశాడంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 

 

చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం ఖరీదు రూ.70కోట్ల పైమాటే.. షేక్ బాజీ అనే పేదకు చెందిన 3.50 ఎకరాల భూమి అది. 1993లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిపై ఆధారపడే షేక్ బాజీ జీవనం సాగిస్తున్నారు .. అయితే ఈ భూమి హక్కుదారు షేక్ బాజీ 2014లో మరణించాడు. దీంతో ఈ విలువైన భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. చంద్రబాబు గద్దెనెక్కాక ఇక్కడ మంగళగిరి పక్కనే అమరావతి రాజధాని ప్రకటన చేయడంతో ఈ భూమి ఎంతో విలువైనదిగా మారిపోయింది  మారిపోయింది. కోట్లరూపాయలు విలువ చేసింది . దీంతో ఈ విలువైన భూమిని ఎలాగైనా చేచిక్కించుకోవాలని  కాజేయాలని టీడీపీ  స్కెచ్వేసిందని  బాధితులు విప్పుతున్నారు వీరి తరుపున . మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కూడా పోరాడారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: