కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఆ కామాంధులు మృగాళ్లుగా మారారు. అప‌హ‌రించుకెళ్లిన యువ‌తిని ఒక‌రి త‌ర్వాత ఒక‌రు 12 మంది అత్యాచారం చేశారు.  ర‌క్త‌స్రావం జ‌రుగుతున్నా...యువ‌తి ఏడుపులు..ఆర్త‌నాదాలు చేస్తున్నా.. ఆదుర్మార్గులు ఆప‌లేదు.. త‌ల వ‌ద్ద ఒక‌డు గ‌న్ను పెట్టి కాపాలాకాస్తే...మిగ‌తా వాళ్లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు  రాక్ష‌సుళ్లుగా త‌మ కోరిక‌ను తీర్చుకున్నారు. ఈ దారుణ సంఘ‌ట‌న గ‌త మంగ‌ళ‌వారం జార్ఖండ్ రాజ‌ధాని రాంచి ప‌ట్ట‌ణ శివారులో జ‌రిగింది.

 

నగర శివార్లలోని సంగ్రాంపూర్ ప్రాంతంలో  యువ‌తి త‌న‌ స్నేహితుడితో కలిసి మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో  వాహ‌నంపై వెళ్తోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన దుండ‌గులు వారి వాహ‌నాన్ని ఓవ‌ర్‌టేక్ చేసి అడ్డ‌గించారు. వెంట‌నే యువ‌తి స్నేహితుడి త‌ల‌పై గ‌న్ పెట్టి బెదిరించారు. మ‌రికొంత‌మంది యువ‌కుడిపై దాడి చేశారు. గాయ‌ప‌డిన అత‌న్ని స‌మీప పొద‌ల్లో ప‌డేశారు. అనంత‌రం యువ‌తిని స‌మీపంలో ఉన్న ఇటుక బ‌ట్టీల వెన‌కాల‌కు తీసుకెళ్లారు. నోరుమెదిపే చంపేస్తామ‌ని చెప్పి త‌ల‌పై గ‌న్ పెట్టారు. ఆ త‌ర్వాత ఒక‌రి త‌ర్వాత ఒక‌రు 12 మంది దుర్మార్గులు అత్యాచారం జ‌రిపారు.

 

అనంత‌రం ఆమెను అక్క‌డే వ‌దిలేసిన దుండ‌గులు పారిపోయారు. స్నేహితుడి స‌హ‌కారంతో పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్న యువ‌తి ఫిర్యాదు చేసింది. ఈ సంఘ‌ట‌న  జార్ఖండ్‌లో సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంద‌ని ఆందోళ‌న‌లు పెరిగాయి. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ప్ర‌భుత్వం, పోలీస్‌శాఖ 48 గంట‌ల్లోనే నిందితుల‌ను అదుపులోకి తీసుకుని క‌ట‌క‌ట‌లా వెన‌క్కి పంపింది. నిందితులు సునీల్ మందా, కుల్దీప్ ఒరాన్, సందీప్ తిర్కీ, అజయ్ ముందా, రాజన్ ఒరాన్, నవీన్ ఒరాన్, అమన్ ఒరాన్, బసంత్ కుచ్చాప్, రవి ఒరాన్, రోహిత్ ఒరాన్, రిషి ఒరాన్‌ను అరెస్ట్ చేసినట్టు కంకే పోలీసులు వివరించారు.

 

కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల ద‌గ్గ‌ర నుంచి కారు, మోటారుసైకిల్, పిస్టల్స్, రెండు లైవ్ కార్ట్రిడ్జ్లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు మరియు బాధితుడి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాము" అని పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) రిషబ్ కుమార్ తెలిపారు. నిందితులపై  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (అత్యాచారాల నిరోధక చట్టం), ఆయుధాల చట్టం కింద వివిధ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: