డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. టోల్‌ ప్లాజా దగ్గర ఉన్న లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన అనుమానితుడిని మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట్‌కు చెందిన మహ్మద్‌ పాషాగా గుర్తించారు. మిగిలిన వారితో కలిసి ఉద్దేశపూర్వకంగానే ప్రియాంకారెడ్డి స్కూటీని పంక్చర్‌ చేశాడు. పంక్చర్‌ బాగు చేయిస్తామనే పేరుతో డ్రామా ఆడారు నలుగురు దుండగులు. గచ్చిబౌలి నుంచి ప్రియాంకారెడ్డి రాగానే పంక్చర్‌ చేయిస్తామని అంటూ మహ్మద్‌ పాషా నాటకాలు ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. ఆపై నలుగురూ కలిసి ఆమెను  కిడ్నాప్‌ చేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. 

 

సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి 9 గంటల 22 నిమిషాలకు సోదరికి చెప్పిన డాక్టర్‌ ప్రియాంక ఫోన్‌ 20 నిమిషాల్లోనే స్విచాఫ్‌ అయ్యింది.  ఆ సమయంలోనే ఆమెను కిడ్నాప్‌ చేశారు. రాత్రి పదిగంటలకే టోల్‌గేట్‌ ప్రాంతానికి ప్రియాంక తండ్రి, సోదరి చేరుకున్నా... అప్పటికే దుండగులు ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్‌ పక్కనే అత్యాచారం చేసి ఆపై ప్రియాంకను చంపేశారు నిందితులు.  ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడి నుంచి  చటాన్‌పల్లికి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లి...కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. ఒక పాలవ్యాపారి మంటలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రియాంక మర్డర్‌ వెలుగులోకి వచ్చింది. రాత్రి  9 గంటల 40 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ఏం జరిగిందనేదానిపై పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

 

చటాన్‌పల్లి బ్రిడ్జి కిందకు డాక్టర్‌ ప్రియాంకారెడ్డి డెడ్‌బాడీని తీసుకొచ్చి కిరోసిన పోసి నిప్పుపెట్టారంటే.. ఇక్కడి పరిసరాలపై అవగాహన ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని బలంగా అనుమానించిన పోలీసులు.. ఆ దిశగానే దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. అదీకాకుండా... ప్రియాంక మృతదేహానికి బ్రిడ్జి కింద నిప్పుపెట్టిన తర్వాత ఆమె వాహనాన్ని మరో పది కిలోమీటర్ల దూరంలో దుండగులు వదిలేశారు. అంటే పక్కా ప్లాన్‌ ప్రకారమే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. 

 

అత్యాచారం చేసిన తర్వాత ఆ ఆనవాళ్లు గుర్తుపట్టకూడదనే ప్రియాంకారెడ్డి  డెడ్‌బాడీపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు. ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ మాదిరే ఈ మర్డర్‌ చేశారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ కలిసి హత్య చేశారు. అలాగే ప్రియాంకారెడ్డిపై గ్యాంగ్‌ రేప్‌ చేసినట్లు కూడా నిర్ధారించారు. నిందితులు మొత్తం మహబూబ్ నగర్‌, రంగారెడ్డి జిల్లాల వాసులుగా తెలుసుకున్నారు. డాక్టర్‌ ప్రియాంకారెడ్డి  ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కూడా పోలీసులకు అందింది. ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టినట్లు పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు తేల్చారు. కిరోసిన్‌ అని తేలిన తర్వాతే ప్రియాంకను లారీ డ్రైవర్లే ఈ హత్య చేశారని గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఆమె శరీరానికి దుప్పటి కప్పి కిరోసిన్‌ పోసి కాల్చి చంపినట్లు తెలుసుకున్నాయి దర్యాప్తు బృందాలు. 

 

డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్యకేసుపై స్పందించారు మంత్రి కేటీఆర్. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఈ కేసును తాను పర్సనల్‌గా మానిటరింగ్‌ చేస్తానని ట్వీట్ చేశారు కేటీఆర్‌. మరోవైపు బాధిత కుటుంబాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.  అమ్మాయిలు తమ దగ్గర షీటీమ్స్‌ నెంబర్లు పెట్టుకోవాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పారు మంత్రి సబితాఇంద్రారెడ్డి.


డాక్టర్‌ ప్రియాంకారెడ్డి దారుణ హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. ఈ హత్య ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.  హైదరాబాద్‌కు ఒక టీమ్‌ను కూడా పంపిస్తున్నట్లు చెప్పారు కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ. ప్రియాంకారెడ్డి హత్యపై కమిషన్‌ సభ్యులు విచారణ చేస్తారని ఆమె తెలిపారు. 
.

 

మరింత సమాచారం తెలుసుకోండి: