హైదరాబాద్ డేర్  అండ్ డాషింగ్ క్రికెటర్ అంబటి రాయుడు. ఈ ఆటగాడు క్రికెట్ లో చాలా దూకుడు చూపిస్తుంటారు. అది బ్యాట్ తోనే కాదు మాటలతోనే బాగానే దూకుడు చూపిస్తుంటాడు అంబటి రాయుడు. కొన్నిసార్లు ఈ ఆటగాడు దూకుడు తో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. అంబటి రాయుడు క్రికెట్ లో తన సత్తా నిరూపించుకున్నప్పటికీ... సరైన అవకాశాలు మాత్రం అందిపుచ్చుకోలేక పోయాడు . దీంతో గతంలో నిరాశ చెంది తన క్రికెట్ కెరీర్ కు  వీడ్కోలు పలికినప్పటికి  ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు క్రికెట్ కి ప్రకటించిన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. అయితే గతంలో ప్రపంచ కప్ లో అంబటి రాయుడుకు  సెలక్టర్లు స్థానం కల్పించలేకపోవడంతో... బీసీసీఐ  సెలెక్టర్లు పై సంచలన ట్వీట్ చేసి పెద్ద దుమారమే రేపాడు అంబటి రాయుడు. దీంతో ప్రపంచ కప్ లో  అంబటి రాయుడుని  సెలెక్ట్ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా సెలెక్టర్లు అంబటి రాయుడు పై మొండిచేయి చేపించారు అని అందరు  అనుకున్నారు. 

 

 

 

 అయితే తాజాగా మరోసారి హెచ్సీఏ గురించి సంచలన ట్వీట్ చేశాడు అంబటి రాయుడు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ కు హెచ్సీఏ లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని అంబటి రాయుడు ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ కు  శాసిస్తున్నారు  అంటూ ట్విట్టర్ వేదికగా అంబటి రాయుడు ఆరోపించారు. హెచ్సీఏ  లో జరుగుతున్న అవినీతి పై మంత్రి కేటీఆర్ దృష్టిసారించాలి  అంటూ అంబటి రాయుడు కోరాడు. దీనిపై హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని అంబటి రాయుడు తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ హెచ్సిఏ  అధ్యక్షుడు అజరుద్దీన్ మాత్రం అంబటి రాయుడు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 ఈ నేపథ్యంలో హెచ్సిఎ లో   అవినీతి తారా స్థాయికి చేరినట్టు బహిరంగ ఆరోపణలు చేసిన క్రికెటర్ అంబటి రాయుడు పై చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిద్ధమవుతోంది. అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకొనినున్నమంటూ  హెచ్సీఏ సభ్యులు ఒకరు వెల్లడించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి జరుగుతున్నట్లు అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని రాయుడు  పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్సీఏ  నిబంధన ప్రకారమే అంబటి రాయుడు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇస్తామని నివేదిక సమర్పించిన తర్వాత హెచ్సీఏ  చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: